గుంటూరు గుండెల్లో గాన గంధర్వుడు

ABN , First Publish Date - 2020-09-26T17:05:53+05:30 IST

గానం గగనానికేగింది. పాటల్లోని అక్షరాలకు తన స్వరంతో సౌందర్యాన్ని అందించి.. ఎందరి మన స్సులనో గెలుచుకున్న అమృత కంఠం మూగబో యింది. ఎస్పీగా.. బాలుగా.. అందరి వాడుగా మారిన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్ర హ్మణ్యం గుంటూరువాసుల గుండెల్లో గాన గంధర్వుడిగా నిలిచారు. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు

గుంటూరు గుండెల్లో గాన గంధర్వుడు

గుంటూరుతో బాలుకు విడదీయరాని అనుబంధం

ఘంటసాల జీవితసాఫల్య పురస్కారంతో సత్కారం

ఘంటసాల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలు

ఆయన స్వరం అజరామరమని జిల్లావాసుల సంతాపం


గుంటూరు(సాంస్కృతికం):  గానం గగనానికేగింది. పాటల్లోని అక్షరాలకు తన స్వరంతో సౌందర్యాన్ని అందించి.. ఎందరి మన స్సులనో గెలుచుకున్న అమృత కంఠం మూగబో యింది. ఎస్పీగా.. బాలుగా.. అందరి వాడుగా మారిన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్ర హ్మణ్యం గుంటూరువాసుల గుండెల్లో గాన గంధర్వుడిగా నిలిచారు. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు సందర్భాల్లో జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆలపించిన మధుర గేయాలతో ఎందరినో మైమరిచిపోయేలా చేశారు. ఆయా కార్య క్రమాల్లో పాల్గొన్న వారు నాటి మధుర జ్ఞాపకా లను గుర్తు చేసుకుంటూ ఇక ఆయన గానా మృతాన్ని నేరుగా ఆస్వాదిం చలేమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 


ఎస్పీ బాలుకు గుంటూరుతో వి డదీయరాని అనుబంధం ఉంది. వివిధ సందర్భాల్లో ఆయన గుంటూ రు వచ్చారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల నుంచి ఎన్నో సత్కారాలు అందు కున్నారు. ప్రధానంగా గుంటూరులోని నాజ్‌ సెంటర్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వ యంగా తన ఆరాధ్య గాయకుడైన ఘంట సాల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కళాదర్బారు అమరావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం జిల్లా సంగీత ప్రి యుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది. తన గురుసమానులైన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పేరు మీద ఘంటసాల జీవిత సాఫల్య పురస్కారాన్ని కళాదర్బారు అమరావతి నుంచి అందుకు న్నారు. ఈ సందర్భంగా నాడు విజ్ఞాన మం దిరంలో ఎస్పీ నిర్వహించిన సంగీత విభా వరి, ప్రసంగం ఇప్పటికీ మారు మోగు తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. 


గుంటూరు గోంగూర అంటే మహా ప్రీతి

తన గానంతో ఎందరినో మైమరిచేలా చేసే ఎస్పీ బాలుకు గుంటూరు గోంగూర అంటే మహాప్రీతి.. సంగీత విభావరిలు, షూటింగ్‌ల పేరుతో ప్రపంచ దేశాలు తిరిగి అనేక రుచులు చవిచూసిన బాలు గుంటూరు గోంగూరంటే మైమరచిపోయేవారు. ప్రతియేటా ఆయనకు గుంటూరు నుంచి అభిమానులు, గాయకులు గోంగూరు పచ్చళ్లను ఇక్కడి నుంచి ప్రత్యేకంగా పంపించేవారు. 


 దైవ భక్తుడైన ఎస్పీ గుంటూరు మారుతీ నగర్‌లోని ఆనాటి ప్రముఖ సినీ నటుడు ధూళిపాళ్ల(మారుతి సేవేంద్ర సరస్వతి స్వామి) ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈవీవీ కళావాహిని  అధ్వర్యంలో ఎస్పీ బాలు సత్కారాలు కూడా అందుకున్నారు.  


2013 శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో ఎస్పీ పాల్గొని గీతా లాపన చేశారు. ఈ సందర్భంగా ఆనాటి ఎంపీ రాయపాటి సాంబశివరావు, టీటీడీ చైర్మన్‌ కను మూరి బాపిరాజు, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఎస్పీ బాలును బంగారు కిరీటంతో సత్కరించారు. 


2015లో గుంటూరు మెడికల్‌ కళాశాల జిం కానా ఆడిటోరియంలో గీతాంజలి ఆర్కెస్ట్రా వారి వెబ్‌సైట్‌ను ఎస్పీ బాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలు ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిని సంగీతప్రియులు ఇప్పటికీ మరువ లేక పోతున్నారు. ఈ సందర్భంగా ఎస్పీని గాయ కుడు అమ్మపండు ఆధ్వర్యంలో  సత్కరించారు.  


ఎస్పీ బాలు మృతి చెందారని తెలి యడంతో జిల్లాకు చెందిన సంగీత ప్రి యులు, ఆయన అభిమానులు శోకసం ద్రంలో మునిగిపోయారు. జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతిని ధులు ఎస్పీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కీర్తిని శ్లాఘి స్తూ నివాళులర్పించారు. ఎస్పీ మృతి సంగీత లోకానికి తీరని లోటని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగా రావు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు తమ సంతాపాన్ని తెలిపారు. పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్ల పాటి రఘునాథబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నాయకుడు డాక్టర్‌ యల మంచిలి శివాజి, కళా దర్బారు అధ్యక్షుడు పొత్తూరు రంగారావు, ఈవీవీ కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి, సీని నటుడు చిట్టినేని లక్ష్మీనారాయణ, ధూళి పాళ్ల కళావాహిని కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్‌, ఎన్టీఆర్‌ కళా పరిషత్‌ కార్యదర్శి కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్‌, గీతాంజలి ఆర్కెస్ట్రా నిర్వాహకులు అమ్మపండు తది తరులతో పాటు కళాకారులు, గాయకులు, కళా సంస్థల నిర్వాహకులు  తమ ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. సాహితీ రంగంలో బాలు చేసిన కృషిని ప్రశంసించారు.

సెలవన్నది మీ శరీరానికే, మీ గళానికి కాదు అంటూ గుంటూరు ఎంపీ గల్లా జ యదేవ్‌, మాజీ మంత్రి గల్లా అరుణ సం తాపం తెలిపారు. తెలుగు సినీకళామా తల్లికి నిజమైన వారసుడు ఎస్పీ అన్నారు.  


స్వరమాంత్రికుడి స్వరం మూగబోయిం దని సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలిపారు. బాహ్యరూపంలో ఆయన లేకపోయినా ఆ యన స్వరం అజరామరమన్నారు. బాలు మరణం తీరని లోటని,  వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.


 సినీ ప్రపంచంలో మేలు పర్వతం నేల కొరిగినట్లైందని రాజ్యసభ సభ్యుడు మోపి దేవి వెంకటరమణ తెలిపారు. సొంత కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినట్లుగా ఉం దన్నారు. వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 


- గాన గంధర్వుడి మరణం సంగీత ప్ర పంచానికి తీరని లోటని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. వారి ఆత్మ కు శాంతి చేకూరాలని మహాకవి జాషువా పీఠం తరపున కోరుతున్నట్లు తెలిపారు.  


 భారతీయ సంగీతాన్ని ప్రపంచనలు మూలలకు తీసుకెళ్లిన మహనీయుడు బాల సుబ్రహ్మణ్యమని టీడీపీ జిల్లా అధ్య క్షుడు జీవీ ఆంజనేయులు కొనియాడారు. అమృత స్వర గాయకుడు, పండితుడు కూడా అని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థి స్తున్నట్లు తెలిపారు. 


 ఏఎన్‌యూ: వర్సిటీ పరిపాలనా భవ నంలో శుక్రవారం ఎస్పీ బాలు చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల తో పాటు ప్రపంచంలోనే గొప్ప గాయకుడి గా ఎస్పీ గుర్తింపు తెచ్చు కున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య వరప్ర సాదమూరి,్త రిజిష్టార్‌ ఆచార్య రోశయ్య, పరీక్ష కో ఆర్డినేటర్లు మధుబాబు, డాక్టర్‌ నాగరాజు, ఓఎస్‌డీ డాక్టర్‌ సునీత, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ ఆచార్య ఉదయ కుమార్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ సూపరింటెం డెంట్‌ కొదండపాణి పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-26T17:05:53+05:30 IST