Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

-  డీజీపీ మహేందర్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, నవంబరు 30: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరతగతిన పరిష్కరించాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లా పోలీస్‌ అధికారులకు సూచిం చారు. మంగళవారం జిల్లా ఎస్పీలు, వివిధ స్థాయి పోలీస్‌ అఽధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరి స్తూ, వాటి సంఖ్యను తగ్గించాలన్నారు. సాంకేతకను పూర్తిస్థాయిలో వినియో గించు కొని  నేరాలపై మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 

సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించి, నేర స్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా చూడాలన్నారు. డ్రగ్స్‌, గంజాయి సరఫరాదారులపై నిఘా వేసి, వారి కదలికలను గమనించాలన్నారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు ఎస్పీ రూపేష్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ రాఘవేంద్రరావు, ఎస్‌బీ, ఐటీకోర్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌లు శ్రీనివాస్‌, సరిలాల్‌, దుర్గ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement