పిల్లల ఎదుగుదల పర్యవేక్షణకు ప్రత్యేక కార్డులు

ABN , First Publish Date - 2022-05-18T09:40:45+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్తున్న చిన్నారుల ఎదుగుదల ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

పిల్లల ఎదుగుదల పర్యవేక్షణకు ప్రత్యేక  కార్డులు

  • పౌష్టికాహారలోపం నివారణకు  పైలెట్‌ ప్రాజెక్ట్‌ 
  • వారికి అదనంగా ఆహారంతోపాటు మరో గుడ్డు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్తున్న చిన్నారుల ఎదుగుదల ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పిల్లలకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరిచేందుకు ఈ శాఖ అధికారులు ‘పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డు’ను  రూపొందించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల వివరాలను అంగన్‌వాడీ రికార్డులతో ఈ కార్డులపై కూడా  నమోదు చేస్తారు. ఈ కార్డులో బిడ్డ పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, పుట్టినప్పటి బరువు, అంగన్‌వాడీ కేంద్రం పేరు, చిరునామా ఉం టాయి. అలాగే, 1 నుంచి 5 సంవత్సరాల వయస్సు పిల్లలను ప్రతి నెలా పరీక్షించి ఎత్తు, బరువు వివరాలను అందులో రాస్తారు. ఈ కార్డులను  ప్రతి నెల తల్లిదండ్రులకు అందజేస్తారు. దాంతో తమ పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన ఏర్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌, నిజామాబాద్‌,వరంగల్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో అమలు చేస్తు న్నారు. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు.  తెలంగాణలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న  12.50 లక్షల మంది చిన్నారుల వివరాలు  అధికారులు ఇప్పటికే సేకరించారు. వారిలో 17.05 శాతం మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కార్డులను తల్లిదండ్రులకు ఇవ్వడం వల్ల వారికి తమ పిల్లల ఎదుగుదల వివరాలు తెలుస్తాయి. తద్వారా పరిస్థితిలో కొంత మార్పు వస్తుందన్న ఆశాభా వం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేర కు అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇతర పిల్లలకు రోజుకు ఒక కోడిగుడ్డు ఇస్తుంటే, పోషకాహారలోపం ఉన్న పిల్లలకు రెండు గుడ్లు ఇ స్తున్నారు. అంతేకాకుండా వారికి ఆహారం మోతాదు కూడా పెంచుతున్నారు. ఈ చ ర్యల ద్వారా బాలబాలిక ఎదుగదలలో మెరుగైన మార్పు వస్తుందని భావిస్తున్నారు.


Updated Date - 2022-05-18T09:40:45+05:30 IST