ప్రతీరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-04-27T04:05:08+05:30 IST

‘పది’ విద్యార్థులకు పరీక్షలు మే 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, అప్పటి వరకు ప్రతీ రోజు రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అడిషనల్‌ కలెక్టర్‌ పద్మజారాణి పేర్కొన్నారు.

ప్రతీరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న అడిషనల్‌ కలెక్టర్‌ పద్మజారాణి

- అదనపు కలెక్టర్‌ పద్మజారాణి

నారాయణపేట, ఏప్రిల్‌ 26 : ‘పది’ విద్యార్థులకు పరీక్షలు మే 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, అప్పటి వరకు ప్రతీ రోజు రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అడిషనల్‌ కలెక్టర్‌ పద్మజారాణి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వాహణ కోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, డీవోలకు మం గళవారం జిల్లా కేంద్రంలోని బీఈడీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించ గా అడిషనల్‌ కలెకక్టర్‌, డీఈవో లియాఖత్‌ అలీ పాల్గొని మాట్లాడారు. రెండేళ్ల తర్వాత పది పరీక్షలు జరుగుతున్నాయని ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులపై ఉందన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్నీ ఏర్పాట్లు చేయాలని, అధికారులు, సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో అనుసరించే అన్నీ అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అన్నీ పాఠశాలలకు 24వ తేదీ నుంచి సెలవులు ప్రకటించిందని, పదో తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్ష లు ప్రారంభమయ్యే వరకు ప్రతీ రోజు ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించిందని, హెచ్‌ఎంలు తమ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్ననరు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేసి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచిపేరు తీసుకరావాలన్నారు. విద్యాశాఖ అధికారులు రాజేంద్ర, వెంకట్రాములు, భానుప్రకాష్‌, యాదయ్య, హెచ్‌ఎంలు, డీవోలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-27T04:05:08+05:30 IST