Abn logo
Oct 27 2021 @ 00:00AM

రోబోలకు ప్రత్యేక దుస్తులు!

రంగురంగుల దుస్తులు మనుషులే వేసుకోవాలా? రోబోలు వేసుకోకూడదా? ఈ ఆలోచన వచ్చిందే తడువుగా జపాన్‌కు చెందిన రాక్‌ట్‌ రోడ్‌ అనే దుస్తుల తయారీ సంస్థ రోబోల కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేసి అందుబాటులోకి తెచ్చింది. జపాన్‌లో రోబోల వినియోగం ఎక్కువ అని తెలిసిందే. రోబోలు దుస్తులు లేకుండా యంత్రాల్లా ఎందుకు కనిపించాలి? అనే ఉద్దేశంతో ఈ దుస్తులను రూపొందించారు. రకరకాల డిజైన్లు, రకరకాల రంగుల్లో ఈ డ్రెస్‌లు తయారుచేశారు. అంతేకాకుండా వీటిని రోబోలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి తయారీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. డస్ట్‌ప్రూఫ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, హీట్‌ రెసిస్టెన్స్‌ మెటీరియల్‌తో తయారుచేశారు. ఆ దుస్తుల్లో రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.