Abn logo
Aug 1 2021 @ 23:16PM

బంగారు తిరుత్తణి కొండపై ప్రత్యేకపూజలు

సోమల, ఆగస్టు 1: సోమల- సదుం మార్గంలోని బంగారు తిరుత్తణి కొండపై కొలువైన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా అభిషేక పూజలు నిర్వహించారు.  ఆలయాన్ని పచ్చని తోరణాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులను  పల్లకీలో అలంకరించి హరోహర నామసర్మణలతో ఊరేగింపుగా తీసు కెళ్లారు. సోమవారం భరణి పుష్పకావిళ్లను కొవిడ్‌ నిబంధనలతో భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని ఆలయధర్మకర్త మేల్నాటి రఘుపతి పద్మావతమ్మ కోరారు.