Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

 -ఆటోల్లో డ్రైవర్ల పక్క సీట్లు తొలగింపు

కరీంనగర్‌ క్రైం, నవంబరు 29: కరీంనగర్‌ ట్రాఫిక్‌ సీఐ తిరుమల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి 30 ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డ్రైవర్‌ పక్క సీట్లు, టేప్‌రికార్డర్‌లను తొలగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డ్రైవర్‌ పక్క సీట్లలో ప్రయాణికులను కూర్చోబెట్టి డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. అలాగే టేప్‌రికార్డర్‌తో పాటలు వింటూ వాహనాలు నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశముందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించామని సీఐ తెలిపారు. ప్రయాణికులతో ఆటో డ్రైవర్లు మర్యాదగా ప్రవర్తించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని ఆయన సూచించారు. అనంతరం ఆటో డ్రైవర్‌, యజమానులకు సీఐ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్‌ సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి, దత్తుప్రసాద్‌ శర్మ, వెంకటేష్‌, రమేష్‌, ఎస్‌ఐ దీపిక, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement