పదిపరీక్షల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు

ABN , First Publish Date - 2020-06-04T09:29:45+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా షెడ్యూల్‌ కులముల అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ సూచించారు.

పదిపరీక్షల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు

సంక్షేమాధికారుల సమావేశంలో డీడీ కస్తాల సత్యనారాయణ


ఖమ్మంసంక్షేమవిభాగం, జూన్‌3: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా షెడ్యూల్‌ కులముల అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ సూచించారు. బుధవారం ఖమ్మం అంబేద్కర్‌ భవనంలో నిర్వహించిన సంక్షేమాధికారుల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. 8నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభ కాబోతున్నాయని, విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిత్యం వైద్యపరీక్షలు, మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరంతో పడకలు వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతీ గదికి ఐదుగురు విద్యార్థులు ఉండేలా వసతి కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి డివిజన్‌కు 100 మాస్కులను పంపిణీ చేశారు.  

Updated Date - 2020-06-04T09:29:45+05:30 IST