పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-06-22T05:26:55+05:30 IST

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, అధికారులు పల్లెప్రగతి పనులపై దృష్టి సారించారు. హరితహారం, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలను ప రిశీలిస్తూ పెండింగ్‌ పనులను పూర్తిచేస్తున్నారు.

పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లాలో పల్లె ప్రగతిపై అధికారుల నజర్‌

ముఖ్యమంత్రి తనిఖీలు నిర్వహించనున్న  నేపథ్యంలో పెండింగ్‌ పనుల పూర్తికి సత్వర చర్యలు

హరితహారంపైనా ప్రత్యేక దృష్టి

పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న  కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు

నిజామాబాద్‌, జూన్‌ 21 (ఆంఽధ్రజ్యోతి ప్రతినిది): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, అధికారులు పల్లెప్రగతి పనులపై దృష్టి సారించారు. హరితహారం, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలను ప రిశీలిస్తూ పెండింగ్‌ పనులను పూర్తిచేస్తున్నారు. అవసరమైన పనులకు పంచాయతీ నిధులను వెచ్చిస్తున్నారు. ఉన్నతాధికారులు తనిఖీలు చేసే అవకాశం ఉండడంతో అప్రమత్తమవుతూ గ్రామాల్లో పనులను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సైతం త్వరలో ప్రతీ జిల్లాలో ఏదైనా ఒక గ్రామంలో పర్యటిస్తానని, ప్రభుత్వం ని ర్ణయించిన విధంగా గ్రామాలు, పల్లెప్రగతి ద్వారా మా ర్పు చెందాయని, మరింత అభివృద్ధి చెందేందుకు పనులన్నీ పూర్తిచేయాలని ఇటీవల అదనపు కలెక్టర్ల సమావేశంలో తెలపడంతో ఉన్నతాధికారులు సైతం అప్రమత్తమవుతున్నారు. శాఖల వారీగా జిల్లా అధికారులకు  సీఎం ఆదేశాలు అందడంతో అందరూ గ్రామాల్లో పెం డింగ్‌ పనులపై దృష్టిపెట్టి పూర్తిచేస్తున్నారు.

రెండేళ్ల క్రితం పల్లెప్రగతి ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం పల్లె ప్ర గతి పనులను ప్రారంభించింది. ప్రతినెలా గ్రామాలకు నిధులు విడుదల చేస్తోంది. పల్లె ప్రగతి కింద హరితహారం, పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు వంటి పనులను చే పట్టారు. హరితహారంలో మొక్కలు నాటారు. ప్రతీ గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను సరఫరా చే స్తున్నారు. ఇవేకాకుండా ప్రతీ గ్రామంలో ఉపాధి హామీ కింద పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఈ వనా ల్లో మొక్కలు నాటారు. గ్రామానికి కావాల్సిన విధంగా పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు. వీటికోసం రెండున్నర లక్షల నుంచి 5లక్షల వరకు వెచ్చించారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలను నిర్మించారు. ఇవేకాకుం డా పారిశుధ్యం కింద సేకరించిన చెత్తను వేసేందుకు కంపోస్ట్‌ షెడ్‌ల నిర్మాణం చేశారు. ఈ మూడు పనులకు ఉపాధిహామీ పథకం ద్వారానే నిధులను మంజూ రు చేశారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పనులను చేపట్టారు. జిల్లాలోని మూడు గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి దొరకక వైకుం ఠధామాలు, కంపోస్ట్‌ షెడ్‌ల నిర్మాణాలు చేపట్టలేదు. మిగతా గ్రామాల్లో పనులను పూర్తిచేశారు.

అలసత్వం వహించినవారిపై చర్యలు..

గ్రామాలలో ఈ పనులను సమీక్షించడంలో.. అలాగే నాటిన మొక్కలను రక్షించడంలో అలసత్వం వహించి న కార్యదర్శి, సర్పంచ్‌పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతినెలా నిధులు ఇస్తున్నా పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న మండలస్థాయి అధికారులపైనా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. వర్షాకాలం మొదలైనందున సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా సర్పంచ్‌లు, అధికారులు పల్లెప్రగతి కింద పనులను చేపడుతున్నారు. గ్రామాలలో చెత్తలేకుండా తరలించడంతో పాటు డ్రైనేజీలు సక్రమంగా వెళ్లేవిధ ంగా పనులు చేస్తున్నారు. వర్షపు నీరు ని ల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో గ్రామాల పరిధిలో మొ క్కలు లేని చోట కొత్తగా నాటుతున్నారు. రహదారుల వెంట ఖా ళీ ప్రదేశాలు లేకుండా చూస్తున్నారు. ప్రతీ రహదారి పరిధిలో ఇరువైపులా రెండు నుంచి నాలుగు వరుస ల్లో మొక్కలను నాటుతున్నారు. గ్రామాల్లో నర్సరీల ద్వారా వీటిని తరలించి ఈజీఎస్‌ కింద కూలీలను ని యమించి పనులు చేస్తున్నారు. 

పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు

ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న పల్లె ప్రగతి ప నులను కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌లు లత, చంద్రశేఖర్‌ గ్రామాల్లో పర్యటిస్తూ పరిశీలిస్తున్నారు. పెండింగ్‌ పనులు ఉంటే పూర్తిచేయాలని స్థా నిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచిస్తున్నారు. వీరితో పాటు మండల ప్రత్యేక అధికారులు ప్రతీ వా రం గ్రామాల్లో పర్యటిస్తూ పనులు పూర్తయ్యేలా చూ స్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గ్రామా ల్లో జరుగుతున్న పనులపైన నిఘా వర్గాలు కూడా ని వేదికలను పంపించాయి. కొన్నిగ్రామాలను ఎంపిక చే సి వాటి పరిధిలో జ రిగిన పనులపైన నివేదికలను ఇచ్చాయి. జిల్లాలో పల్లె ప్రగతి కింద చేపట్టిన అన్ని పనులు పూర్తయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్‌ జయసుధ తెలిపారు. ఒక మూడు గ్రామాల పరిధిలోనే ప్రభుత్వ భూమి దొరకక పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రతీ వారం గ్రామా ల్లో పల్లె ప్రగతి కింద చేపట్టే అన్ని పనులను చేస్తున్నామని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-06-22T05:26:55+05:30 IST