వాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-12-04T06:32:22+05:30 IST

ముంచుకొస్తున్న మూడో ముప్పుతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకదృష్టిని సారిం చింది. రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థానంలో నిలవడంతో అధికారుల్లో హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన ఆరు జిల్లాల జాబితాలో జిల్లా పేరును చేర్చడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత యేడాది జనవరి 16 నుంచి జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టారు. దాదాపుగా యేడాది కావొస్తున్నా..

వాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

జిల్లా అధికారులతో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ సమీక్షా సమావేశం

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పనితీరుపై అసంతృప్తి

సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం

ఈనెల 22 వరకు లక్ష్యం పూర్తి చేయాలంటూ ఆదేశం

ఆదిలాబాద్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): 

ఆదిలాబాద్‌ జిల్లా సమగ్ర సమాచారం

జిల్లాలో మొత్తం గ్రామాలు          : 1190

గ్రామ పంచాయతీలు          : 468

మున్సిపల్‌ పరిధిలో వార్డులు          : 49

పట్టణ ప్రాంతంలో అర్హులైన వారు     : లక్షా 75,983

గ్రామీణ ప్రాంతంలో అర్హులైన వారు   : 3లక్షల 72,111

జిల్లాలో మొత్తం వ్యాక్సినేషన్‌ టార్గెట్‌  : 5లక్షల 48,094

ఫస్ట్‌డోసు పూర్తయిన వారు          : 4లక్షల 32,478

సెకండ్‌ డోసు పూర్తయిన వారు         : లక్షా 28,902

ముంచుకొస్తున్న మూడో ముప్పుతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకదృష్టిని సారిం చింది. రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థానంలో నిలవడంతో అధికారుల్లో హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన ఆరు జిల్లాల జాబితాలో జిల్లా పేరును చేర్చడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత యేడాది జనవరి 16 నుంచి జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టారు. దాదాపుగా యేడాది కావొస్తున్నా.. వందశాతం టార్గెట్‌ పూర్తికాక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే.. వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఆకస్మికంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో పాటు నిర్మల్‌, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్‌లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, పంచాయతీ రాజ్‌, ము న్సిపల్‌ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆశించిన స్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తికాక పోవడానికి గల కారణాలపై ఆరా తీ శారు. దాదాపు రెండు గంటల సేపు సమీక్ష జరిపిన సీఎస్‌ జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వెంటనే యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకుని వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అ యితే జిల్లాలో 5లక్షల 48వేల 94 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేసేందు కు అధికారులు లక్ష్యంగా పెట్టుకు న్నారు. కాగా ఇప్పటి వరకు మొదటి డోసు 4లక్షల 32వేల 478 మందికి వేయగా, సెకండ్‌ డోసు లక్షా 23వేల 902 మందికి పూర్తి చేశారు. మిగి తా 3లక్షల 8వేల 576 మందికి రెండో డోసును పూర్తి చేయాల్సి ఉంది. అలాగే మిగితా లక్షా 15వేల 616 మందికి ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ వేయాల్సి ఉంది. అయితే థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికతో జిల్లావాసుల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. ఇప్ప టి వరకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తికాకపోవడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22, 23వరకు వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎస్‌ హె చ్చరిస్తూ డెడ్‌లైన్‌ విధించడంతో జిల్లా అధికారుల్లో హడావుడి నెలకొంది. 

అధికారుల తడబాటు

జిల్లాలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలతో సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా అధికారులు సీఎస్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడినట్లు తెలుస్తుంది. జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయ న్న ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సరైన సమాధానం చెప్పక పోవడంపై సీఎస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జిల్లాలో గ్రామాల సంఖ్య తెలియని అధికారులు వ్యాక్సినేషన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించినట్లు సమాచారం. జిల్లాలో ఆశిం చిన స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరుగలేదని అధికారిక లెక్కల ప్రకారం స్పష్టమవుతుంది. పూర్తిస్థాయి వివరాలతో సమీక్ష సమావేశానికి హాజరు కా వాలని ఒకరోజు ముందే కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదేశించినా.. కొందరు అధికారులు నిర్లక్ష్యం చేయడంపై అయోమయ పరిస్థితులకు దారి తీసింది. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ అధికారుల లెక్కలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తమయ్యింది. మొదటి నుంచి అధికారులు పక్కాప్లాన్‌తో ముందుకు వెళ్లకపోవడంతోనే జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా పరిస్థితులు కొంత తగ్గుముఖం పట్టడంతో అధికారులు వ్యాక్సినేషన్‌పై నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతుంది. మళ్లీ థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందన్న హెచ్చరికలతో అప్రమత్తమైనా.. ఇప్పట్లో లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువైన పనేమీ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తొలగని అపోహలు

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై మొదటి నుంచి కొన్ని వర్గాల్లో అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రమైన జ్వరం, అస్వస్థత లాంటి సమస్యలు తలెత్తుతాయన్న అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు. అయినా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శ లు వస్తున్నాయి. ప్రధానం గా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల మధ్య సమన్వ యం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆచార సంప్రదాయాలు, ఏదో తెలియని భయం కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో విస్త్రృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు మరింత చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. కొంతమంది అధికారులు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోకపోవడంతోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అనుకున్నం త స్థాయిలో ముందుకు వెళ్లడం లేదంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగక పోవడం, ఆల స్యంగా ప్రారంభించడంతో గ్రామీణులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతూ వ్యాక్సినేషన్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో పూర్తిగా వెనుకబడి పోవడానికి వ్యాక్సినేషన్‌పై ఏమాత్రం అవగాహన లేకపోవడమేనన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. కులపెద్దల సహకారంతో వ్యా క్సినేషన్‌ పంపిణీని చేపడితే మె రుగైన ఫలితాలు వచ్చే అవకాశం క నిపిస్తుం ది. ఓ వర్గం వ్యాక్సినేషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది.

Updated Date - 2021-12-04T06:32:22+05:30 IST