నిమ్మగడ్డ అంటే జగన్‌కు భయమా?. అనుమానమా?

ABN , First Publish Date - 2020-12-06T00:55:38+05:30 IST

భారత ప్రజా స్వామ్యానికి ఎన్నికలే పునాది. ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం. ప్రజలిచ్చే తీర్పుని ఎన్నికలు మాత్రమే ప్రతిబింబించగలుగుతాయి. అలాంటి..

నిమ్మగడ్డ అంటే జగన్‌కు భయమా?. అనుమానమా?

అమరావతి: భారత ప్రజా స్వామ్యానికి ఎన్నికలే పునాది. ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం.  ప్రజలిచ్చే తీర్పుని ఎన్నికలు మాత్రమే ప్రతిబింబించగలుగుతాయి. అలాంటి ఎన్నికలు నవ్వులు పాలవుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాల్సిన వ్యవస్థలే పొలిటికల్ బాసుల చేతిలో కీలుబొమ్మాలుగా మారితే ఇక ప్రజా తీర్పునకు విలువేముంటుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవస్థ మీద పెద్ద విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికలు, ఫలితాలపై తెలంగాణ ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున గుప్పుమంటున్నాయి. బ్యాలెట్ గుర్తుపై స్వస్తిక్ గుర్తు కాకుండా.. పెన్నుతో మార్క్ చేసినా ఓటు లెక్కింపులోకి వస్తుందని ఎస్ఈసీ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ మొత్తం అనేది లేదని అసెంబ్లీలో ఏకంగా తీర్మానమే పెట్టేశారు. అధికార పార్టీ చెప్పినప్పుడే ఎన్నికలు, చేసినట్టే ఎన్నికలు అనే తరహాలో తీర్మానం చేశారు. ఈ తీర్మాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యతిరేకిస్తోంది. గవర్నర్‌కు కూడా లేఖ రాసింది. 


ఈ నేపథ్యంలో ‘‘స్థానిక ఎన్నికలను జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?. నిమ్మగడ్డ అంటే భయమా?. అనుమానమా?. రాజ్యాంగ వ్యవస్థను డమ్మీ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చా?. ప్రతిపక్షాన్ని ఎత్తిపడేయండి అని సీఎం అనడం ఎలాంటి ప్రజాస్వామ్యం?. హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు విధానం సరైనదేనా?. గ్రేటర్‌లో వైసీపీ విధానాన్ని ఏపీ బీజేపీ ఎలా పరిగణిస్తోంది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-12-06T00:55:38+05:30 IST