ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2021-04-10T06:45:04+05:30 IST

మాత, శిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ఫారూఖీ అధికారులను ఆదేశిం చారు.

ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
మాత, శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 : మాత, శిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ఫారూఖీ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ మాత,శిశుసంరక్షణ కేంద్రంలో నూతనం గా చేపట్టిన స్కానింగ్‌ సెంటర్‌, ల్యాబ్‌, వోపీ వార్డు, పేషెంట్స్‌ వెయిటింగ్‌ హాల్‌ పలు నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌తో కలిసి ఆయన పరి శీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించుటకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాత, శిశు సంరక్షణ కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల నిర్మా ణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు  సూచించారు. ఈ కార్య క్రమంలో వైద్యాధికారులు దేవేందర్‌రెడ్డి, రజిని, తహసీల్దార్‌ సుభాష్‌చందర్‌, నాయకులు రాంకిషన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ముప్పై పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌ 

నర్సాపూర్‌(జి), ఏప్రిల్‌ 9 : మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలన్నారు. అర్హులైన వారం దరూ టీకా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారి ధనరాజ్‌, డ్యూటీ డాక్టర్‌ వేదవ్యాస్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ శుభచరణ్‌, స్టాఫ్‌ నర్స్‌ సునిత, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-04-10T06:45:04+05:30 IST