Abn logo
Mar 2 2021 @ 00:29AM

అవిశ్వాస తీర్మానాలపై ప్రత్యేక సమావేశాలు

తేదీలు ఖరారు చేసి నోటీసులు జారీ చేసిన తూప్రాన్‌ ఆర్డీవో

15న ముప్పిరెడ్డిపల్లి, 16న మల్కాపూర్‌, 17న కాళ్లకల్‌లో సమావేశాలు


తూప్రాన్‌, మార్చి 1 : ఉపసర్పంచులపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు తేదీలు ఖరారు చేస్తూ తూప్రాన్‌ ఆర్డీవో టీ.శ్యాంప్రకాశ్‌ నోటీసులు జారీ చేశారు. ఆర్డీవోకు ఉపసర్పంచులపై ఫిర్యాదులు చేసిన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లిలో ఈనెల 15న, కాళ్లకల్‌లో 17న తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో 16న ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. గత నెల ఫిబ్రవరి 18న ముప్పిరెడ్డిపల్లి పంచాయతీ వార్డు సభ్యులు, 19న కాళ్లకల్‌, మల్కాపూర్‌ వార్డు సభ్యులు ఆర్డీవోకు అవిశ్వాసంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కాళ్లకల్‌ పంచాయతీలో ఉపసర్పంచు పదవిని ఒకటోవార్డు సభ్యుడు తుమ్మల రాజుయాదవ్‌ ఆశిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో గెలుపొందగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం సహకరించే సూచనలు లేకపోవడంతో పార్టీ మారేందుకు నిశ్చయించుకున్నారు. ఈమేరకు సోమవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో రాజుయాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.


Advertisement
Advertisement