ప్రత్యేక తెలుగు సాహితీ కార్యక్రమం.. 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలతో చరిత్రలో తొలిసారి..

ABN , First Publish Date - 2021-09-13T22:51:18+05:30 IST

“మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” ప్రత్యేక తెలుగు భాష, సాహిత్య సమావేశం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు..

ప్రత్యేక తెలుగు సాహితీ కార్యక్రమం.. 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలతో చరిత్రలో తొలిసారి..

“మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” ప్రత్యేక తెలుగు భాష, సాహిత్య సమావేశం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25-26 శని-ఆది వారాలలో కెనడా రాజధాని టొరంటో ప్రధాన కేంద్రంగా ఈ వేడుకలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు సాహితీ చర్చ జరనున్నట్లు వెల్లడించారు. టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించేలా ఆన్‌లైన్ లింకులను అందుబాటులో ఉంచామని తెలిపారు.


రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్‌లు (EST, Toronto Time 9:00 AM-7:00 PM ప్రతీ రోజూ)

September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1

September 26, 2021  YouTube: https://bit.ly/3mjgLYS


ఈ కార్యక్రమం కోసం త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వం లో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాల కోసం https://youtube.com/embed/U4tX3dNHlKw వీడియో లింక్‌ను పరిశీలించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.


అలాగే సదస్సుకు సంబంధించిన మరేదైనా సమాచారం కోసం ఈ క్రింది వారిని సంప్రదించాలని సూచించారు.

సంచాలకులు : లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com 

వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్, యూఎస్ఏ): vangurifoundation@gmail.com

సంధాన కర్తలు:    విక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com;  శాయి రాచకొండ (USA): sairacha@gmail.com

కార్యనిర్వాహక సంఘం సభ్యులు: యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల

నిర్వహిస్తున్న సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణా అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం.



Updated Date - 2021-09-13T22:51:18+05:30 IST