Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలయాలకు కార్తీక శోభ

- చివరి సోమవారం ప్రత్యేక పూజలు

- అలంపూర్‌కు పోటెత్తిన భక్తులు

- దీపాలు వెలిగించిన మహిళలు

అలంపూరు/ గద్వాల టౌన్‌/ ఇటిక్యాల/ గట్టు, నవంబరు 29 : కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. ఐదవ శక్తిపీఠం జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. వేకువఝామునే భక్తులు తుంగభద్ర నది లో పుణ్యస్నానాలు చేసి, కార్తీక దీపాలను వెలిగిం చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారు లు తీరారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మ వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయాల ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అయితే క్షేత్రంలోని నవబ్రహ్మ, యోగ నరసింహస్వామి ఆలయాల్లో అర్చకులు పూజలు చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 


- గద్వాల పట్టణంలోని ఆలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. పట్టణ సమీపంలోని కృష్ణానదిలో భక్తులు పుణ్యసాన్నాలు చేశారు. స్థానిక అన్నపూర్ణేశ్వరీ ఆలయంలో శివుడికి అభిషేకాలు, బిల్వార్చన, భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయం వద్ద వీరశైవులు నందికోల సేవలను ఉత్సాహంగా నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి ఆలయంలో కార్తీక బహుళ శుభ ముహూ ర్తంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని కను లపండువగా నిర్వహించారు. దాతలు తిరుమలరావు, శోభ దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రసన్నచార్‌, ప్రహ్లాద్‌చార్‌, ప్రమోదాచార్‌ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కిషోర్‌, ప్రేమ్‌, వైభలతో పాటు గుల్బర్గాకు చెందిన భక్తులు స్థానికులు పాల్గొన్నారు. 


- ఇటిక్యాల మండలంలోని సాసనూల్‌ గ్రామంలోని శివాలయంలో లక్ష దీపార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని శివాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణ లో శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించారు. 


- గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో ఉన్న రామలింగేశ్వర అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివస్వాములు ఈశ్వరుడికి అభిషేకం చేశారు. 


Advertisement
Advertisement