2023 నాటికి ప్రత్యేక రాయలసీమ ఇచ్చి తీరాలి

ABN , First Publish Date - 2021-07-23T05:20:12+05:30 IST

వచ్చే 2023 నాటికి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చి తీరాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

2023 నాటికి ప్రత్యేక రాయలసీమ ఇచ్చి తీరాలి
మాట్లాడుతున్న కుంచెం వెంకటసుబ్బారెడ్డి

లేదంటే పార్టీలకతీతంగా సీమ ఉద్యమం 

ఆర్‌ఆర్‌ఎ్‌స పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం


కడప(మారుతీనగర్‌), జూలై 22: వచ్చే 2023 నాటికి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చి తీరాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే భారత రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్‌ 3ను అనుసరించి 1951 నాటి మద్రా సు రాష్ట్రంలో ఉన్న కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, క్రిష్ణగిరి, బల్లారి,  రాయచూర్‌, చిత్రదుర్గ, కోలార్‌ జిల్లాలతో కలిపి ప్రత్యేక రాయలసీమగా ఇవ్వాలన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాలలలో బిల్లు ఆమోదింపచేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక చొరవచూపాలన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం జలాశయంలోని నీటిని విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం తోడుకుపోతుంటే రాయలసీమ ప్రజల పరిస్థితేంటని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎ్‌స జగన్‌మోహన్‌రెడ్డిలు ఒకచోట చర్చలు జరిపి తద్వారా శ్రీశైలం నీటి సమస్యను పరిష్కరించుకుంటే సబబుగా ఉంటుందన్నారు. అలాకాకుండా ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖలు రాసినంత మాత్రానా లాభంలేదన్నారు.  

Updated Date - 2021-07-23T05:20:12+05:30 IST