అందరికంటే ముందుగా ABN లో బ్రేకింగ్‌ న్యూస్‌..

ABN , First Publish Date - 2021-10-15T17:21:05+05:30 IST

ఏబీఎన్‌కే ప్రత్యేకమైన కార్యక్రమాలు తెలుగు టెలివిజన్‌ రంగంలో ట్రెండింగ్‌ అయ్యాయి. అవి కాకుండా.. వార్తలు, వార్తల ఆధారిత కార్యక్రమాలు, వార్తల వెనకున్న లోగుట్టు గురించి చెప్పే ప్రోగ్రాములు కూడా ఏబీఎన్‌కే సొంతం....

అందరికంటే ముందుగా ABN లో బ్రేకింగ్‌ న్యూస్‌..

ఏబీఎన్‌కే ప్రత్యేకమైన కార్యక్రమాలు తెలుగు టెలివిజన్‌ రంగంలో ట్రెండింగ్‌ అయ్యాయి. అవి కాకుండా.. వార్తలు, వార్తల ఆధారిత కార్యక్రమాలు, వార్తల వెనకున్న లోగుట్టు గురించి చెప్పే ప్రోగ్రాములు కూడా ఏబీఎన్‌కే సొంతం. తనదైన శైలిలో, తనదైన దూకుడుతో, తనదైన కోణంలో ఆవిష్కరిస్తోన్న కార్యక్రమాల గురించి ఇప్పుడు చూద్దాం...


సమాచార స్రవంతిని, బ్రేకింగ్‌ న్యూస్‌ను నిరంతరం అందరికంటే శరవేగంగా అందిస్తూనే.. ఏ రోజు కారోజు పరిస్థితులను, పరిణామాలను విశ్లేషించే చర్చావేదికలు నిర్వహిస్తోంది ఏబీఎన్‌. ఉదయాన్నే పత్రికల్లో వార్తలను జల్లెడపట్టడంతో పాటు.. బిజినెస్ అప్‌డేట్స్‌, ఆఫ్టర్‌నూన్‌ డిస్కషన్స్‌, ఈవెనింగ్‌ డిబేట్స్‌ చేపడుతోంది. వీటికి తోడు వీకెండ్‌ స్పెషల్ ప్రోగ్రామ్స్‌ ఇంటిల్లిపాదినీ ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. 


ప్రభుత్వాల్లో చర్చలు, రాజకీయ రచ్చలను ఏ మొహమాటం లేకుండా కడిగి పారేస్తోంది ది డిబేట్‌. ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ వెంకట కృష్ణ సాగించే ది దిబేట్‌ ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. ఏ అంశంలో ఏ కనిపించని రహస్యం దాగి ఉందో, ఏ నిర్ణయంలో ఏ నిగూఢార్థం పొంచి ఉందో తేటతెల్లం చేస్తోంది. సమకాలీన పరిస్థితులపై ప్రశ్నించే తత్వాన్ని ప్రజల్లోనూ అలవాటు చేస్తోంది. పొలిటికల్‌ అప్‌డేట్స్‌పై ఎవరి ఒపీనియన్‌ ఏంటన్నది ఏబీఎన్‌ వేదికగా ది డిబేట్‌ చూపిస్తోంది. ప్రతిరోజూ ప్రైమ్‌టైమ్‌లో బర్నింగ్‌ టాపిక్స్‌పై రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ది డిబేట్‌ ఎక్కుపెట్టే ప్రశ్నలు వీక్షకుల మస్తిష్కంలోకి చొచ్చుకుపోతున్నాయి. ఆ అంశాలు గుర్తుండిపోతున్నాయి. 


తెలతెల వారగానే ఇంటి ముంగిట వార్తా పత్రిక గంట కొడుతుంది. ఒకటీ, రెండూ ప్రధాన వార్తా పత్రికలు మనుగడలో ఉన్నప్పుడు వాటితోనే సమాచార స్రవంతిని అవగతం చేసుకునేవాళ్లం. అయితే, ఇప్పుడు డిజిటల్ యుగం. సమాచారం శరవేగంగా జనం ముందుకు వచ్చేస్తోంది. సమాచారంతో పాటే.. పోటీగా వార్తా విశ్లేషణలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. ఈ పరిణామ క్రమంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతి ఉదయం ఏడున్నర గంటలకు హెడ్‌లైన్‌ షో ద్వారా వార్తలను చెప్పడమే కాదు.. ఆ రోజు సంచలన వార్తలతో సంబంధం ఉన్నవాళ్లతోనూ మాట్లాడిస్తోంది. సమాచార స్రవంతిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తోంది.


ప్రతినిత్యం సాయంకాలం వేళ.. ఆ రోజు ట్రెండింగ్‌లో ఉన్న అంశంపైనా, మేజర్‌ ఇష్యూ పైనా స్పెషల్‌ ఎడిషన్‌ పేరిట లోతైన చర్చ చేపడుతోంది ఏబీఎన్‌. రోజంతా సాగుతున్న వార్తల పరంపరలో గంట పాటు ప్రధాన టాపిక్‌లపై నిపుణులు, ప్రముఖులతో చర్చాగోష్టి నిర్వహిస్తోంది. ఈక్రమంలో అవసరమైతే నెట్‌వర్క్‌ లైవ్‌లు, న్యూస్‌రూమ్‌ లైవ్‌లు కూడా ఉపయోగించుకుంటోంది.


స్పెషల్‌ ఎడిషన్‌ మాదిరిగానే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా వీకెండ్‌లో ప్రసారమవుతున్న సండే ఎడిషన్ కూడా ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. నిత్యం హాట్‌ టాపిక్‌లతో కొనసాగే స్పెషల్ ఎడిషన్‌ ఆదివారానికి వచ్చేసరికి సండే ఎడిషన్‌గా పేరు మార్చుకొని కాస్త కూల్‌గా మారుతుంది. సాఫ్ట్‌ టాపిక్స్‌ను ఎంచుకుంటుంది.


ఏబీఎన్‌లో ప్రసారమయ్యే వీకెండ్‌ పొలిటికల్‌ ఇంటర్వ్యూ న్యూస్‌మేకర్‌. ఆ వారంలో టాప్‌లో నిలిచిన రాజకీయ నాయకుడిని గానీ, చర్చల్లో టాప్‌గా నిలిచిన అంశంపై గానీ న్యూస్‌మేకర్‌ ద్వారా సవివర విశ్లేషణను ఏబీఎన్‌ ప్రేక్షకులకు అందించే ప్రయత్నమే న్యూస్‌ మేకర్‌. ఫేస్‌ టు ఫేస్‌గా సాగే ఈ ఇంటర్వ్యూ నాయకుల అసలు కోణాన్ని బయటపెడుతుంది. 


రాజకీయాల లోగుట్టును  క్షేత్రస్థాయి నుంచి పసిగట్టి తెరమీదకు తేవడమే ఇన్‌సైడ్‌ ఉద్దేశ్యం. నిత్యం అందించే వార్తల వెనుక దాగి ఉన్న నగ్న సత్యాలను, ప్రధానంగా రాజకీయ వార్తల లోగుట్టు కథనాలను ప్రేక్షకులకు అందించే వేదిక ఇన్‌సైడ్‌. నాయకులు ఏం చెబుతున్నారన్నది కాదు.. వాళ్లేం చేస్తున్నారన్నది చూపించడం ఇన్‌సైడ్‌ అసలు లక్ష్యం. అందుకే రాజకీయ వార్తలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఇన్‌సైడ్‌కోసం ఎదురుచూస్తుంటారు.


ప్రైమ్‌టైమ్‌లో డిబేట్‌, ప్రధాన వార్తా బులెటిన్‌ ప్రసారమైన తర్వాత సమగ్రమైన కథనాలను అందించే స్పెషల్‌ న్యూస్‌ బులెటిన్‌ టెన్‌ ఎట్‌ టెన్‌. దీనిపేరే టెన్‌ ఎగ్జయిటింగ్‌ న్యూస్‌. ఆ రోజు రాజకీయంగా, సామాజికంగా, డిజిటల్‌ వేదికగా ఏయే అంశాలు ట్రెండింగ్‌లో నిలిచాయో ప్రత్యేకంగా నిర్ధారించి మరీ ఎంచుకునే న్యూస్‌ బులెటిన్‌ ఇది. అరగంటలోనే అన్ని అంశాలనూ వీక్షకుల ముందుకు తెస్తోంది. ఏపీ, తెలంగాణ మొదలు, హైదరాబాద్‌, నేషనల్‌, ఇంటర్నేషనల్‌, క్రైమ్‌, సినిమా, స్పోర్ట్స్‌, వైరల్‌, ట్రెండింగ్‌ కేటగిరీల్లో వార్తా కథనాలను అందించే కార్యక్రమం టెన్‌ ఎట్‌ టెన్‌. 


వారమంతా చర్చల్లో నిలిచిన, సంచలనం సృష్టించిన, ప్రభావం చూపించిన ముఖ్యమైన కథనాల సమాహారమే ఏబీఎన్‌ 360. వీకెండ్‌లో ఆదివారం సాయంత్రం ప్రసారమవుతుందీ కార్యక్రమం. ఇవే కాకుండా.. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల బులెటిన్‌లో బిజినెస్‌ అప్‌డేట్స్‌, ఆర్థిక నిపుణుల విశ్లేషణలు అందిస్తోంది. ఏబీఎన్‌ బిజినెస్‌ ద్వారా.. ఆ రోజు మార్కెట్‌ అంచనాలను, పట్టుబడి దారులు ఎంచుకోవాల్సిన మార్గాలను సూచిస్తోంది. 


సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-10-15T17:21:05+05:30 IST