వార్తలే కాదు.. వార్తల వెనకున్న అసలు కోణాలనూ వెలికితీసే ABN

ABN , First Publish Date - 2021-10-15T18:13:08+05:30 IST

వార్తలే కాదు.. వార్తల వెనకున్న అసలు కోణాలనూ వెలికితీస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. వార్తల ప్రసారాలే కాదు.. వార్తల ఆధారిత కార్యక్రమాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ప్రధానంగా వీకెండ్‌లో జనానికి ఎంటర్‌టైన్‌మెంట్....

వార్తలే కాదు.. వార్తల వెనకున్న అసలు కోణాలనూ వెలికితీసే ABN

వార్తలే కాదు.. వార్తల వెనకున్న అసలు కోణాలనూ వెలికితీస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. వార్తల ప్రసారాలే కాదు.. వార్తల ఆధారిత కార్యక్రమాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ప్రధానంగా వీకెండ్‌లో జనానికి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇస్తోంది. 


నిరంతరం టెలికాస్ట్‌ అయ్యే వార్తా ప్రసారాలలో వైవిధ్యాన్ని  జోడిస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. వార్తల్లోనే వెరైటీని, వార్తలను అందించే శైలిలోనే ప్రత్యేకత చూపిస్తోంది. ప్రజలకు సమస్యగా మారే ఏ అంశం మీద అయినా, ప్రజలపై చెడు ప్రభావం చూపించే ప్రభుత్వాల నిర్ణయాలపైనా న్యూస్‌రూమ్‌ లైవ్స్‌ నిర్వహిస్తోంది. అలాగే, ఏబీఎన్‌ విలేకరుల గ్రౌండ్‌ రిపోర్ట్స్‌తో క్షే్త్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. 


ఇక.. న్యూస్‌ బులెటిన్లలో ప్రతిరోజూ ఉదయం ఏడు గంటల బులెటిన్‌లో ర్యాపిడ్‌ఫైర్‌ పేరిట సమస్త సమాచారాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచి మొదలుకొని, మెట్రో నగరాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్‌, స్పోర్ట్స్‌, సినిమా న్యూస్‌లు అందులో ఉండేలా చూస్తోంది. ఇక.. బులెటిన్ల మధ్య ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ అప్‌డేట్‌ సమాచారానికి వారధిగా మారుతోంది. హెడ్‌లైన్లలోనూ వినూత్న ధోరణి ప్రవేశపెట్టి.. విజువల్స్‌ లేకున్నా హెడ్‌లైన్స్‌ రూపంలో ర్యాపిడ్‌ న్యూస్‌ అందిస్తోంది. నాలుగు నిమిషాల్లో 20 హెడ్‌లైన్స్‌ ద్వారా సమస్తాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. అలాగే, సిక్స్‌టీ సెకండ్స్‌ సింగిల్‌ న్యూస్‌ పేరిట బులెటిన్‌ ఎండ్‌లో ఒక నిమిషంలోనే టాప్‌ ఇష్యూకు సంబంధించిన సమగ్ర వార్తను ప్రసారం చేస్తోంది. 


న్యూస్‌ ప్రోగ్రామ్స్‌ మాత్రమే కాదు.. న్యూస్‌ బేస్డ్‌ ప్రోగ్రామ్స్‌ కూడా ఏబీఎన్‌ ప్రేక్షకులకు పూర్తిస్థాయి పరిజ్ఞానాన్ని అందించేందుకు దోహదపడుతున్నాయి. ఆ కోణంలోనే ప్రసారమవుతోంది రెడ్‌ అలర్ట్‌. నేరవార్తల ప్రసారంలో ఇదో సంచలనం. నేరాలు, దారుణాలను రిపోర్ట్‌ చేయడమే కాదు.. వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లనూ పట్టి లాగుతోంది రెడ్అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేసేలా.. నటీనటులతో సీన్‌ టూ సీన్‌ రికార్డ్‌ చేసి ప్రసారం చేస్తోంది. క్రైమ్‌ న్యూస్‌ ఒరవడిలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.


ఎప్పుడూ రాజకీయాలు, నేరాలు, వార్తలేనా.. అని నిట్టూర్చకుండా ప్రతి ఉదయం ఆరు గంటల ఫస్ట్‌ బులెటిన్‌లో ఆధ్యాత్మిక సువాసన ఉండేలా చూస్తోంది ఏబీఎన్‌. ఆలయ రహస్యం పేరిట తెలుగు రాష్ట్రాల్లోనివే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల ప్రత్యేకతలు, వాటి విశిష్టతలను ప్రపంచానికి తెలియజేస్తోంది. అలాగే, వీకెండ్‌లో వెంకటేశ్వర వైభవం పేరిట.. తిరుమల శ్రీనివాసుడి ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇవేకాదు.. సందర్భాన్ని బట్టి డివోషనల్‌ న్యూస్‌కు తగినంత స్పేస్‌ కల్పిస్తోంది ఏబీఎన్‌. నవరాత్రోత్సవాల సందర్భంగా దేవీ వైభవం పేరిట.. ప్రత్యేకంగా అరగంట కార్యక్రమం ప్రసారం చేస్తోంది. 


ఆధ్యాత్మికంతో పాటు.. అగ్రికల్చర్‌ న్యూస్‌పైనా చిన్నచూపు చూడటం లేదు ఏబీఎన్‌. రైతుల విజయాలు, అన్నదాతల అరుదైన ఆవిష్కరణలు, పంటల సాగులో టెక్నాలజీ ప్రయోగాలు వంటి పాజిటివ్‌ వార్తలను 'ఏరువాక'గా న్యూస్‌ బులెటిన్లలో ప్రసారం చేస్తోంది.


తొలినుంచీ తెలుగు లోగిళ్లలో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంటిల్లిపాదికీ ఆహ్లాదాన్ని అందించే వారధిగా సినిమాల గురించి చెప్పుకుంటారు. అలాంటి సినిమా వార్తలంటే జనం చెవికోసుకుంటారు. ఏబీఎన్‌ కూడా ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లు సినిమా వార్తలను కూడా ప్రసారం చేస్తుంది. సినిమాల అప్‌డేట్స్‌, పాన్‌ ఇండియా మూవీల ముచ్చట్లు, అఫీషియల్‌ ప్రెస్‌మీట్లు, సినిమాల అనౌన్స్‌మెంట్లకు సంబంధించిన వార్తలను మూవీ సెంటర్‌లో చూపిస్తోంది. అలాగే, సినిమా రంగంలో తెరవెనుక జరిగే పరిణామాల గురించి గుసగుసలు  విశదీకరిస్తుంది. సినీ ప్రముఖుల మధ్య లవ్‌ ఎఫైర్స్‌, సీక్రెట్‌ మ్యారేజెస్‌, బాయ్‌ఫ్రెండ్స్‌, గాళ్‌ ఫ్రెండ్స్ వ్యవహారాల గురించి గుసగుసల్లో ప్రేక్షకులకు వినిపించడం జరుగుతోంది. ఇవే కాకుండా.. వీకెండ్‌లో మూవీ మజా బులెటిన్ ప్రసారమవుతుంది. ఆ వారంలోని ప్రధాన సినిమా వార్తలు, పరిణామాలను సమగ్రంగా అందిస్తుంది మూవీ మజా.


సంప్రదాయ మీడియాగా మీడియా రంగంలో ప్రవేశించినప్పటికీ.. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఒడిసిపట్టుకుంటూ, టెక్నాలజీని వంట బట్టించుకుంటూ, ఆధునిక పరిజ్ఞానాన్ని మిళితం చేసుకుంటూ దూసుకుపోతున్న ఏబీఎన్‌ ప్రస్తుతం డిజిటల్‌ ఎరాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. నెక్ట్స్‌ జనరేషన్‌ కోసం.. నెక్ట్స్‌ లెవెల్‌ ప్రోగ్రామ్‌లకు రూపకల్పన చేస్తోంది. డిజిటల్‌ ఎరాలో డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మిగతా మీడియా సంస్థలకన్నా భిన్నంగా, ఇతర సంస్థల కన్నా వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రత్యేక టీమ్‌ ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పైనా తన సహజ ధోరణిలోనే దూసుకుపోతోంది.


డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌కోసమే ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని  స్పెషల్‌ ప్రోగ్రామ్‌లను, ప్లే లిస్ట్‌లను డిజైన్‌ చేసింది ఏబీఎన్‌. డీజే న్యూస్‌, ఆర్‌జె న్యూస్‌, ఏబీఎన్‌ 3 మినిట్స్‌, ఏబీసీ న్యూస్‌ పేరిట తనదైన శైలిలో స్పెషల్ న్యూస్‌ను ప్రెజెంట్‌ చేస్తోంది.


సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-10-15T18:13:08+05:30 IST