ముగిసిన ప్రత్యేక సర్వే

ABN , First Publish Date - 2021-07-23T06:23:58+05:30 IST

ప్రత్యేక అవసరా లు గల పిల్లలకు చేయూతను అందించేందుకు సమగ్రశిక్షా అభియాన్‌ ద్వారా నిర్వహిస్తున్న సర్వే గురువారం ముగిసింది.

ముగిసిన ప్రత్యేక సర్వే
వేములవాడలోని తిప్పాపూర్‌లో సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది

- జిల్లాలో శారీరక, మానసిక వైకల్యం గల విద్యార్థులు 113 మంది 

- విద్యార్థులకు చేయూతనిస్తున్న ప్రభుత్వం

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, జూలై 22: ప్రత్యేక అవసరా లు గల పిల్లలకు చేయూతను అందించేందుకు సమగ్రశిక్షా అభియాన్‌ ద్వారా నిర్వహిస్తున్న సర్వే గురువారం ముగిసింది. చిన్నతనం నుంచే అంగవైక ల్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వారికి సహాయపడుతోంది. ఎముకల బలహీనత, పక్షవాతం, బుద్దిమాంద్యం వంటి తదిత ర సమస్యలతో బాధపడే వారిని గుర్తించి వారికి సా ధారణ విద్యార్థుల మాదిరిగానే సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వైద్య సేవలు అందిస్తోంది. దీనిలో భాగంగానే 2021-22 విద్యాసంవత్సరానికి ఇంక్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ కో ఆర్డినేటర్‌ (ఐఈఆర్‌పీ)ల ద్వారా నిర్వహించిన సర్వే  గురువారంతో ముగియ గా జిల్లాలో 113 మంది విద్యార్థులను గుర్తించి వారిని చైల్డ్‌ ఇన్ఫ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

- 18 సంవత్సరాల లోపు వారికి అవకాశం

జిల్లాలోని 13 మండలాల్లో ఐఆర్‌పీలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఈ నెల 1 నుంచి 22 వరకు ఇంటింటి సర్వేతో పాటు ఆయా గ్రామాల అంగన్‌వాడీలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సహాయంతో 113 మందిని గుర్తించారు. ఈ సర్వేలో 18 సంవత్సరాల వయసు వరకు అవకాశం కల్పిం చారు. గత సంవత్సరం వరకు జిల్లాలో 552 మంది ఉండగా ప్రస్తుతం గుర్తించిన వారితో  జిల్లాలో మొత్తం 665 మంది విద్యార్థులు ఉన్నారు. గుర్తిం చిన వారిని కేటగిరీల వారీగా చేర్పించారు. వీరిలో పాఠశాలల్లో చదివే వారు 455 మంది, భవిత సెం టర్‌లలో ఉన్న వారు 104 మంది, ఇంటి వద్దనే ఐఆర్‌పీలు వారానికి ఒకరోజు చదువు చెప్పేవారు 39 మంది, బడి బయట ఉన్నవారు 45 మంది, ఐదు సంవత్సరాల పిల్లలు 22 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల అబ్బాయిలకు రూ. 350 అందుతోంది. అమ్మాయిలకు రూ. 350 తో పాటు అదనంగా రూ 200 అందించనున్నారు. వీరిని పాఠశాలకు తీసుకువచ్చేందుకు సహాయకులు గా ఉన్న వారికి రూ. 350 అందించనున్నారు. దీంతో పాటుగా ట్రై సైకిళ్లు, టీచింగ్‌ కిట్స్‌, ఫిజియోథెరపీ డాక్టర్‌తో నెలకు నాలుగు సార్లు చికిత్స అందించనున్నారు.  

- ఉపాధ్యాయుల కొరత..

జిల్లాలోని 13 మండలాల్లో భవిత సెంటర్లు ఉన్నాయి. వీటిలో సిరిసిల్ల, వేములవాడలో ప్రత్యేకం గా సెంటర్లు ఉండగా, మిగతా మండలాల్లో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయిం చి కొనసాగిస్తున్నారు. ప్రతి మండలానికి ఇద్దరు ఐఈఆర్‌పీ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 13 మండలాలకు  10 మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని మిగతా ఐఈఆర్‌పీల ను నియమించాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-23T06:23:58+05:30 IST