Abn logo
Feb 23 2021 @ 02:24AM

శిశువులను అమ్ముకుంటున్న దుండగులు.. ముఠా గుట్టు రట్టు!

ఇండోర్: అప్పుడే పుట్టిన శిశువులను దొంగచాటుగా అమ్ముకుంటున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దొరికిపోయింది. ఇలా శిశువులను అమ్ముతున్న ముగ్గుర్ని ఇక్కడి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో స్థానిక జిల్లా ఆస్పత్రిలో పనిచేసే నర్సు కూడా ఉండటం గమనార్హం. అలాగే వీరి వద్ద నుంచి  ఇద్దరు పిల్లలను కొనుగోలు చేసిన రెండు జంటలను కూడా అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఓ జంట 9ఏళ్ల క్రితం, మరో జంట 13 ఏళ్ల క్రితం పిల్లలను కొన్నారు. ఈ జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పిల్లలను కూడా కాపాడినట్లు తెలియజేశారు. మొత్తమ్మీద ఈ ఘటనలో 9మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement