Abn logo
Sep 26 2021 @ 02:31AM

జార్ఖండ్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా గోవాకు ప్రత్యేక రైలు

బర్కత్‌పుర, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గోవాకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. జార్ఖండ్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా కొత్త రైలు ప్రారంభంకానుంది. ఈ నెల 28న జార్ఖండ్‌లోని జసీడీ రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైలు ప్రారంభమై గోవాలోని వాస్కోడిగామాకు వెళ్లనుంది. 28న రైలు (06398) మధ్యాహ్నం 1.15 గంటలకు జసీడీ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరి చిత్తరంజన్‌, బొకారో స్టీల్‌ సీటీ, రాంచీ, రూర్కెలా, బిలా్‌సపూర్‌, రాయపూర్‌, బలార్ష, మంచిర్యాల, కాజీపేట మీదుగా 29న సాయంత్ర ం 6 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి వికారాబాద్‌, రాయచూర్‌, గుంతకల్‌, బళ్లారి, హుబ్లి మీదుగా ఈ నెల 30న మధ్యాహ్నం 2.40 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. ఈ రైల్లో రెండు ఏసీ టూ టైర్‌, థర్డ్‌ ఏసీ త్రీ టైర్‌, ఐదు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు, రెండు జనరల్‌ సెకండ్‌క్లాస్‌ బోగీలుంటాయని అధికారులు తెలిపారు.