యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-09-27T11:34:58+05:30 IST

యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు అక్టోబరు 3, 4 తేదీలలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తూర్పుకోస్తా రైల్వే శనివారం ప్రకటించింది. ఇచ్చాపురం-విశాఖపట్నం, కొరాపుట్‌-కటక్‌, కొరాపుట్‌-విశాఖపట్నం మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. 


 06831 నంబరు రైలు ఇచ్ఛాపురంలో 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయల్దేరి విశాఖపట్నం అదే రోజు రాత్రి 8:15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 4వ తేదీ రాత్రి విశాఖలో 7:30 గంటలకు బయల్దేరి ఇచ్ఛాపురానికి 11:30 గంటలకు చేరుతుంది.


05803 నంబరుతో కొరాపుట్‌ నుంచి 3వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు రైలు బయల్దేరి అదే రోజు రాత్రి 7:55 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఆ రైలు తిరిగి 4న రాత్రి 9:40 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం కొరాపుట్‌ చేరుతుంది.


05801 నంబరుతో  కొరాపుట్‌లో 3వ తేదీ ఉదయం 5 గంటలకు బయల్దేరి రాత్రి 9 గంటలకు కటక్‌ చేరుతుంది. మరుసటి రోజు ఆ రైలు కటక్‌లో రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కొరాపుట్‌ వెళుతుంది.   

Updated Date - 2020-09-27T11:34:58+05:30 IST