పండగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-10-22T08:23:31+05:30 IST

పండగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

పండగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పండగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రైలు (08585) నవంబరు 2న 17.35 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (08586) 3న 21.05గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు 9.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు(08583) నవంబరు 1వ తేదీ 19.15 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 5న ప్రత్యేక రైలు (08197) జంషెడ్‌పూర్‌ టాటా స్టేషన్‌ నుంచి బయలుదేరి కాచిగూడ చేరుకుంటుందది. 6న ప్రత్యేక రైలు (08198) కాచిగూడ నుంచి బయలుదేరి జంషెడ్‌పూర్‌ టాటా చేరుకుంటుంది. 

Updated Date - 2021-10-22T08:23:31+05:30 IST