Abn logo
Apr 2 2020 @ 14:49PM

వచ్చే నెలలో `రామరాజు ఫర్ భీమ్`?

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అలాగే రామ్‌చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా గత నెల 27న `భీమ్ ఫర్ రామరాజు` పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 


ఈ వీడియోలో చరణ్ లుక్స్‌కు, ఎన్టీయార్ డబ్బింగ్‌కు ప్రశంసలు లభించాయి. వచ్చే నెలలో చిత్రబృందం నుంచి మరో సర్‌ప్రైజ్ రానుందట. వచ్చే నెల 20వ తేదీన ఎన్టీయార్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా `ఆర్ఆర్ఆర్`లో ఎన్టీయార్ లుక్ బయటకు రానుందట. `రామరాజు ఫర్ భీమ్` పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేయాలనుకుంటున్నారట. మరి, ఎన్టీయార్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందే.  

Advertisement
Advertisement
Advertisement