Abn logo
Sep 19 2021 @ 01:29AM

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ చేపట్టాలి

వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంత్‌ గోయల్‌

రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్‌ గోయల్‌

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌


భువనగిరి రూరల్‌, నల్లగొండ టౌన్‌, సూర్యాపేట, సెప్టెంబరు 18: తుది ప్రచురణ కోసం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్‌ గోయల్‌ కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్‌ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తుది ఓటరు జాబితాపై శనివారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 ఓటరు జాబితా సవరణ, ముసాయిదా సవరణ, ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గరుడ యాప్‌లో బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా పోలింగ్‌స్టేషన్ల వివరాల నమోదుతోపాటు 1500 మంది ఓటర్లకంటే ఎక్కువ ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయాలని సూచించారు. కామన్‌ సర్వీస్‌ కేంద్రాల ద్వారా ఓటర్లు ఓటరు ఐడీకార్డు పొందేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. 202 2,జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేలా అన్ని చర్యలు తీసుకోవాలని, ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట కలెక్టర్లు పమేలాసత్పథి, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.