వాస్కో-జాసిది మధ్య ప్రత్యేక వీక్లీ రైలు

ABN , First Publish Date - 2021-10-27T06:53:38+05:30 IST

గుంతకల్లు మీదుగా వాస్కో-జాసిది మధ్య వీక్లీ ప్రత్యేక రైలును వేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు.

వాస్కో-జాసిది మధ్య ప్రత్యేక వీక్లీ రైలు

గుంతకల్లు, అక్టోబరు 26: గుంతకల్లు మీదుగా వాస్కో-జాసిది మధ్య వీక్లీ ప్రత్యేక రైలును వేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. నవంబరు 5వ తేదీ నుంచి జనవరి ఆఖరు వరకూ ఈ రై లు నడపనున్నట్లు తెలిపారు. వాస్కో-జాసిది రైలు (నెం.06397) ప్రతి శుక్రవారం ఉదయం 5-15 గంటలకు బయలుదేరి సాయంత్రం 4- 25 గంటలకు గుంతకల్లుకు చేరుకుని, మరుసటిరోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానానికి చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.06398) ప్రతి సోమవారం మధ్యా హ్నం 1-10 గంటలకు బయలుదేరి మరుసటిరో జు ఉదయం 2-45 గంటలకు గుంతకల్లుకు, మ ధ్యాహ్నం 2-40 గంటలకు వాస్కోకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు మడ్గావ్‌, క్యాస్టిల్‌ రాక్‌, లోండా, ధార్వాడ్‌, హుబ్లీ, గదగ్‌, కొప్పల్‌, హాస్పేట, తోరణగల్లు, బళ్లారి, గుంతకల్లు, రా యచూరు, వికారాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, మం చిర్యాల, బాలార్ష, రాయ్‌పూర్‌, బిలా్‌సపూర్‌, రూర్కెలా, హతియా, రాంచీ, చంద్రాపూర్‌, ధనబాద్‌, చిత్తరంజన, మధుపూర్‌ మీదుగా ప్రయాణిస్తుందన్నారు.


రైళ్లకు తాత్కాలికంగా జనరల్‌ కోచలు

గుంతకల్లు మీదుగా వెళ్లే మైసూరు రైళ్లకు రెండు జనరల్‌ బోగీలను జత చేసి పంపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మైసూరు-బాగల్‌కోట్‌ వెళ్లే రైలు (నెం. 07307)లో ఈ నెల 26 నుంచి నవంబరు 20వ తేదీ వరకూ, తిరుగు ప్రయాణపు రైలులో ఈనెల 27 నుంచి నవంబరు 21వ తేదీ వరకూ ఈ జనరల్‌ బోగీలను జతచేస్తామన్నారు.


జనరల్‌, సీజన టిక్కెట్లకు అనుమతి

బెంగళూరు-హిందూపురం సెక్షనలో జనరల్‌, సీజనల్‌ టిక్కెట్ల ప్రయాణికులు ధర్మవరం-బెంగళూరు సెక్షనలో స్లీపర్‌ క్లాస్‌ బోగీలలో ప్రయాణించడానికి తాత్కాలికంగా అనుమతినిస్తున్నట్లు తెలిపారు. యల్హంక-కాచిగూడ-యల్హంక వెళ్లే (నెం.07603/04) రైళ్లలో, ముంబై-బెంగళూరు-ముంబై వెళ్లే (నెం.01301 /02) రైళ్లలో, మైసూరు-బాగల్‌కోట్‌-మైసూరు వెళ్లే (నెం. 07307/08) రైళ్లలో నవంబరు 20వ తేదీ వరకూ స్లీపర్‌క్లాస్‌, రిజర్వుడు బోగీలలో సీజనల్‌, జనరల్‌ టిక్కెట్‌ హోల్డర్లు ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. నవంబరు 20వ తేదీ వరకూ ఈ సదుపాయం కల్పించామన్నారు.


సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రె్‌సకు ఎల్‌హెచబీ బోగీలు 

యశ్వంతపూర్‌-హజ్రత నిజాముద్దీన-యశ్వంతపూర్‌కు వెళ్లే సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ (నెం.06249/50) రైళ్లకు, ఇదే మార్గంలో వెళ్లే నెం.026 29/30 యశ్వంతపూర్‌-హజ్రత నిజాముద్దీన-యశ్వంతపూర్‌ రైళ్లకు ఎల్‌హెచబీ రేక్‌ను రీప్లే్‌సమెంట్‌ చేసినట్లు తెలిపారు. మునుపు ఉన్న కన్వెన్షనల్‌ బోగీల స్థానంలో అధునాతన జర్మన టెక్నాలజీతో తయారు చేసిన ఎల్‌హెచబీ బోగీలుగా మార్పుచేసినట్లు తెలియజేశారు.

Updated Date - 2021-10-27T06:53:38+05:30 IST