బాటిల్‌లో బైడెన్... సైకతశిల్పంగా కమలా హ్యారిస్!

ABN , First Publish Date - 2021-01-20T17:41:49+05:30 IST

అమెరికా 46వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నజో బైడెన్‌కు...

బాటిల్‌లో బైడెన్... సైకతశిల్పంగా కమలా హ్యారిస్!

భువనేశ్వర్: అమెరికా 46వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నజో బైడెన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జో బైడెన్ ఈరోజు వాషింగ్టన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత్ నుంచి కూడా బైడెన్‌ను పలువురు అభినందనలతో ముంచెత్తుతూ సందేశాలను పంపుతున్నారు. 


ఒడిశాకు చెందిన ఆర్టిస్టు ఎల్ ఈశ్వర్ రావు బాటిల్‌లో బైడెన్ కళాకృతిని రూపొందించి అతనికి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా, పలువురు ఈశ్వర్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. అలాగే ఒడిశాకు చెందిన కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తాజాగా పూరీ బీచ్‌లో అమెరికాలో జరగబోయే ప్రమాణస్వీకారోత్సవ నమూనాను ఇసుకతో రూపొందించారు. దీనిలో కాబోయే అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆకృతులను అందంగా తీర్చిదిద్దారు.

Updated Date - 2021-01-20T17:41:49+05:30 IST