Abn logo
Sep 24 2021 @ 00:57AM

బాబా ఆలయంలో ప్రత్యేకపూజలు

బాబాఆలయంలో పూజలో పాల్గొన్న భక్తులు

నిర్మల్‌, సెస్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పట్టణ శివారులోని గండిరామన్న క్షేత్రంలో గల సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. నిర్మల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి బాబాదర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న హారతిలో పాల్గొన్న భక్తులకు ఆలయ పూజారులు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేసి పదవీ విరమణ పొందిన బి.కిషన్‌ జ్ఞాపకార్థం ఆయన సతీ మణి గంగామణి, కుమారుడు సుధాకర్‌లు నేటి అన్నదాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ సింగిల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డి మాట్లా డుతూ... ఇక్కడి ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయికృపకు పాత్రులు కావాలని కోరారు. ఇటీవలే ఆల యా న్ని, పరిసరాలను పూర్తిగా ఆధునీకరించామని తెలిపారు. పూర్తి ఆహ్లాదకర వాతావరణంలో ఆలయ పరిసరాలు భక్తులను కనువిందు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి మాస్టర్‌, కందుల పండరి, గోపాల్‌రెడ్డి, ముక్కశేఖర్‌, జోగు భూషణ్‌, తదితరులు పాల్గొన్నారు.