మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-05-31T10:55:58+05:30 IST

మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేయండి

మంత్రి ఈటల రాజేందర్‌


హుజూరాబాద్‌, మే 30: మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులకు సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పనులు 75 శాతం పూర్తయ్యాయని మిగిలిన పనులను వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌లోగా ఇంటింటికి నల్లాలు బిగించాలన్నారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ డీఎంహెచ్‌వో సుజాత, డిప్యూటి డీఎంహెచ్‌వో సుధాకర్‌రెడ్డి, వైద్యులతో సమీక్ష నిర్వహించారు.  కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌లు కొలిపాక నిర్మల, దేశిని స్వప్న, మిషన్‌ భగీరథ అధికారులు పాల్గొన్నారు.


మంత్రికి వినతి

హుజూరాబాద్‌ సబ్‌ డివిజన్‌ తపాలా ఉద్యోగులు, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం శనివారం కేసీ క్యాంపులోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు మహేందర్‌, నిరంజన్‌, గోపి, కిషన్‌, సమ్మయ్య, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-31T10:55:58+05:30 IST