Abn logo
Aug 1 2020 @ 21:03PM

సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి దగ్గర కలకలం

హైదరాబాద్‌: సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి దగ్గర కలకలం రేగింది. మోహన్‌బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్లింది. మిమ్మల్ని వదలమంటూ దుండగులు హెచ్చరించి వెళ్లారు. దీంతో.. భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేనట్లు తెలిసింది. ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు సమాచారం. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అయితే.. మోహన్‌బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత అవసరం, ఆ స్థాయి శత్రువులు ఎవరా అన్న చర్చ మొదలైంది. ఆకతాయిలైనా కావాలనే ఇలా చేశారా లేక నిజంగానే మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పూనుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. 


Advertisement
Advertisement
Advertisement