Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్యకు నంద్యాలతో ఆత్మీయ అనుబంధం

నంద్యాల, డిసెంబరు 4: నంద్యాలతో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో ఆత్మీయ అనుబంధం ఉంది. పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యం రోశయ్య చివరి రోజుల వరకు  కొనసాగింది. నంద్యాలకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లగిశెట్టి సుబ్బగురుమూర్తితోపాటు దివంగత కాంగ్రెస్‌ నేత పెసల శ్రీనివాసులు శెట్టి, ఆర్యవైశ్య ప్రముఖులు భవనాశి శ్రీరామమూర్తి, విశ్వవాణి విద్యాసంస్థల అధినేత, రాష్ట్ర నర్సింగ్‌ కళాశాలలు, పాఠశాలల అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు కందుకూరి శ్రీరామమూర్తిలు రోశయ్యతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. మహానంది ఆర్యవైశ్య అన్నదాన సత్రాన్ని రోశయ్య చేతులు మీదుగా అప్పట్లో ప్రారంభించారు. 


 రోశయ్య మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహా యాదవ్‌ అన్నారు. కొణిజేటి రోశయ్య ఆకస్మిక మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు,్చ జిల్లా గౌరవాధ్యక్షుడు లగిశెట్టి సుబ్బగురుమూర్తి నివాసంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం, నంద్యాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం పొలిటికల్‌ ఛైర్మన్‌ ఖండే శ్యామ్‌ సుందర్‌లాల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు జేవీసీ ప్రసాద్‌, కశెట్టి చంద్రశేఖర్‌, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తొమంధ్ర నాగరాజు, ప్రధాన కార్యదర్శి మలిపెద్ది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. Advertisement
Advertisement