జన్నేపల్లికి ఆధ్యాత్మికశోభ

ABN , First Publish Date - 2021-03-02T05:26:39+05:30 IST

నవీపేట మండలంలోని జన్నేపల్లి సోమవారం ఆధ్యాత్మి క శోభను సంతరించుకుంది. గ్రామంలోని పురాతన శివాలయానికి పూర్వవైభవం వచ్చింది. మల్కాజ్‌గిరి శాసనసభ్యు డు మైనంపల్లి హన్మంత్‌రావు కోటి రూపాయలు వెచ్చించి శివాలయాన్ని ఆధునికీకరించారు.

జన్నేపల్లికి ఆధ్యాత్మికశోభ
ఎమ్మెల్సీ కవితకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న పూజారులు, ఎమ్మెల్యే మైనంపల్లి

పురాతన శివాలయానికి పూర్వవైభవం

కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి

ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత

పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ

భారీగా తరలివచ్చిన భక్తులు

నిజామాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/నవీపేట : నవీపేట మండలంలోని జన్నేపల్లి సోమవారం ఆధ్యాత్మి క శోభను సంతరించుకుంది. గ్రామంలోని పురాతన శివాలయానికి పూర్వవైభవం వచ్చింది. మల్కాజ్‌గిరి శాసనసభ్యు డు మైనంపల్లి హన్మంత్‌రావు కోటి రూపాయలు వెచ్చించి శివాలయాన్ని ఆధునికీకరించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న శి వాలయాన్ని మరింత అబివృద్ధి చేశారు. పాత శివాలయా న్ని కదిలించకుండానే మండపాలతో పాటు ఇతర నిర్మాణా లు చేశారు. శివాలయం చుట్టూ రెండున్నర ఎకరాల్లో ప్రహరీ నిర్మించారు. శివాలయం చుట్టూ మండపాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో మరో శివుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు పెట్టి పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. భక్తులు వచ్చి పూజలు చే సుకునేవిధంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణ ంలో భారీ ఏర్పాట్లు చేశారు. 

పాల్గొన్న ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ 

జన్నేపల్లిలోని శివాలయం పూర్వవైభవం సంతరించుకు న్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆమె రాక సందర్భంగా శివాలయ ప్రాం గణంలో భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చి న ఆమె.. శ్రీరాముడు స్వయంగా నిర్మించినట్లుగా చెబుతు న్న ఈ పురాతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఆమెతో పాటు జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావ్‌, ఎమ్మెల్యేలు షకీల్‌ అమీర్‌, గ ణేష్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలి త, దయానంద్‌, మేయర్‌ దండు నీతూ కిరణ్‌, జడ్పీటీసీ బా జిరెడ్డి జగన్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నా రు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు.  పూ జల సందర్భంగా మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్‌ నుంచి భారీ ర్యాలీ

జన్నేపల్లిలోని శివాలయంలో జరిగే పూజల్లో పాల్గొనేందు కు వచ్చిన కవితకు ఘన స్వాగతం లభించింది. హైదరాబా ద్‌ నుంచి జన్నేపల్లికి బయలుదేరిన కవితకు జాతీయ రహదారి వెంట టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి వెంట ఆమెను ఆపి స్వాగతం పలికారు. ఆమె వెంట భారీగా వాహనాల ద్వారా కార్యకర్తలు అనుసరించారు. నిజామాబాద్‌ వరకు కదలివచ్చారు. వందలాది కార్లు, బైక్‌ల ద్వారా జన్నేపల్లి వరకు ర్యాలీని ని ర్వహించారు. నిజామాబాద్‌ నగర సమీపంలోని మాధవనగర్‌ వద్ద ఆమెకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. క్రే న్‌ ద్వారా ఆమెకు గజమాల వేశారు. ఈ ర్యాలీలో నలుపురంగు కార్లను వినియోగించారు. గతంలో ఎన్నడూలేని విధ ంగా భారీ వాహనాల ద్వారా జన్నేపల్లికి కవిత వెంట టీఆర్‌ఎస్‌ శ్రేణులు కదలివచ్చారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆమె వెంట జన్నేపల్లికి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. మైనంపల్లి అనుచరులు కూడా మల్కాజ్‌గిరి నుంచి భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌ నుంచి జన్నేపల్లి వరకు భారీ ర్యాలీగా రావడంతో శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపించింది. ని జామాబాద్‌కు 15 కి.మీల దూరంలో పూలాంగ్‌ వాగుకు ఒ డ్డున ఉన్న జన్నేపల్లి గ్రామం ఈ కార్యక్రమంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నవీపేట, నందిపేట మండలాల మధ్య ఉన్న ఈ గ్రామం వాణిజ్యపరంగా కూడా చు ట్టూ పది గ్రామాలకు కేంద్రంగా ఉంది. ప్రస్తుతం శివాల యాన్ని అభివృద్ధి చేయడంతో మరింత వెలుగులోకి వచ్చిం ది. గ్రామాన్ని కూడా మండలకేంద్రంగా చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించడంతో భవిష్యత్‌లో మరింత అభివృద్ధి అ య్యే అవకాశం కనిపిస్తోంది. ఈ గ్రామంలో పురాతన శివాలయం ఉన్నా గతంలో అభివృద్ధి జరగలేదు. మైనంపల్లి హ న్మంత్‌రావు అత్తగారు ఊరు కావడం, ఆయన ఆ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఉండడం, ప్రస్తు తం అభివృద్ధి చేయడంతో పేరు మరింత పెరిగింది. మండలకేంద్రంగా మారితే చుట్టూ పక్కల గ్రామాలకు కూడా ఉ పయోగపడుతుందని గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఎమ్మెల్యే షకీల్‌ కూడా గ్రామానికి కావాల్సిన అన్ని అండదండలు అందిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-03-02T05:26:39+05:30 IST