Abn logo
Sep 27 2021 @ 22:42PM

సెటిల్‌మెంటు ప్రతులు దహనం చేసిన ఎస్పీఎం కార్మికులు

సెటిల్‌మెంటు ప్రతులను దహనం చేస్తున్న కార్మికులు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 27: విధుల్లోకి తీసుకోని ఎస్పీఎం కార్మికులు 190 మందికి ఇచ్చిన సెటిల్‌ మెంట్‌ ప్రతులను కార్మి కులు సోమవారం సాయంత్రం దహనం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మూడేళ్లుగా తమను విధుల్లోకి తీసుకోవాలని పోరాటం చేస్తుండగా యాజ మాన్యం మాత్రం నిర్లక్ష్యం వహించి విధుల్లోకి తీసుకోకుండా ఏకంగా సెటిల్‌ మెంటుచేసే ప్రక్రియకు తెరలేపిందన్నారు. ఇందులోకూడా పూర్తిగా అన్యాయం చేసేట్టు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్మికులు షబ్బీర్‌ హుస్సేన్‌, ఏకే సింగ్‌, వెంకటేష్‌, జాన్‌ ప్రకాష్‌, అంబాల ఓదెలు పాల్గొన్నారు.