నీ ప్రేమ అమోఘం

ABN , First Publish Date - 2020-05-24T08:23:18+05:30 IST

గాయపడిన తండ్రిని ఎక్కించుకొని వందలాది కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి క్షేమంగా స్వస్థలానికి చేరిన బిహార్‌ బాలిక జ్యోతికుమారిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ప్రశంసల్లో ముంచెత్తారు.

నీ ప్రేమ అమోఘం

‘సైక్లిస్ట్‌’ జ్యోతికి ఇవాంక ప్రశంస


న్యూఢిల్లీ: గాయపడిన తండ్రిని ఎక్కించుకొని వందలాది కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి క్షేమంగా స్వస్థలానికి చేరిన బిహార్‌ బాలిక జ్యోతికుమారిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ఆమె సాహసం అద్భుతం. తండ్రిపై ఉన్న అమోఘ ప్రేమకు, తనలోని ఓర్పునకు తార్కాణం’ అని ఇవాంక ట్వీట్‌ చేశారు. ‘లాక్‌డౌన్‌ వేళ 15 ఏళ్ల కుమారి సైకిల్‌పై తండ్రిని కూర్చుండబెట్టుకొని 1200 కి.మీ., ఏడు రోజులకుపైగా ప్రయాణించి స్వగ్రామానికి చేరింది. ఆమె సహనం, తండ్రిపై అవ్యాజ ప్రేమానురాగాలు యావత్‌ భారత దేశ ప్రజలతోపాటు సైక్లింగ్‌ సమాఖ్యను ఆకట్టుకున్నాయి’ అని ఆమె కొనియాడారు. జ్యోతి తండ్రి గురుగ్రామ్‌లో ఆటో డ్రైవర్‌. అయితే లాక్‌డౌన్‌తో అతడికి ఉపాధి పోవడంతో తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని గుర్‌గ్రామ్‌నుంచి సొంతూరు బిహార్‌లోని దర్భాంగాకు జ్యోతి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. జ్యోతి సాహసానికి దేశ ప్రజలంతా జేజేలు పలకగా.. సైక్లింగ్‌ సమాఖ్య ఆమెను న్యూఢిల్లీలో ట్రయల్స్‌కు పిలిచింది.

Updated Date - 2020-05-24T08:23:18+05:30 IST