‘ఆట’ంకం తొలగింది!

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా సుమారు 11 నెలల పాటు నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో క్రీడలకు బ్రేక్‌ పడింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టేడియంలో నిత్య సాధన చేసే క్రీడాకారులు తమ ఇళ్లకే పరిమితమయ్యారు.

‘ఆట’ంకం తొలగింది!
స్కేటింగ్‌ సాధన చేస్తున్న చిన్నారులు

సుదీర్ఘ విరామం తర్వాత స్టేడియంలో క్రీడా సందడి

ఖమ్మం స్పోర్ట్స్‌, జనవరి 18: కరోనా మహమ్మారి కారణంగా సుమారు 11 నెలల పాటు నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో క్రీడలకు బ్రేక్‌ పడింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టేడియంలో నిత్య సాధన చేసే క్రీడాకారులు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఇంటిలో వార్మప్‌లు చేయగా మరికొందరికి ఆ అవకాశం లేకపోవడంతో శిక్షణ లేక డీలా చెడ్డారు. ఇ ప్పుడిప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇచ్చి ఆటలు ఆడేందుకు అనుమతులు ఇవ్వడంతో క్రమేపీ స్టేడియాలన్నీ తెరుచుకున్నాయి. మరో వైపు విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో విధ్యార్థుల ఆసక్తి క్రీడలపై మళ్లింది. ముఖ్యంగా స్టేడియంలో అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, జిమ్నాస్టిక్స్‌, క్రికెట్‌, ఉషూ, బ్యాడ్మింటన్‌, లాన్‌టెన్నీస్‌, స్కేటింగ్‌, టేబుల్‌టెన్నీస్‌, ఫుట్‌బాల్‌, స్విమ్మింగ్‌ తదితర క్రీడా విభాగాలలో శిక్షణలు నిత్యం జరుగుతుంటాయి. కరోనా కాణంగా స్విమ్మింగ్‌ శిక్షణ మినహా మిగతా క్రీడలన్నీ తిరిగి జోరందుకున్నాయి. 

సుదీర్ఘ విరామం తర్వాత స్టేడియంలో సందడి

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుమారు ఏడాది పాటు స్టేడియంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించలేదు. ఏ క్రీడా సంఘం కనీసం ఎంపికలు సైతం జరపలేదు. స్టేడియం మ రలా తెరుచుకోవడంతో ఈ నెల మొదటి వారంలోనే అథ్లెటిక్స్‌ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించారు. దీంతో రాష్ట్రంలోని 31 జిల్లాల క్రీడాకారులు అథ్లెటిక్స్‌ పోటీలకు రావడంతో స్టేడియం క్రీడా సందడితో మురిసిసోయింది. అనంతరం ఇటీవల జల్లా క్రికెట్‌ సంఘం, వాలీబాల్‌ సంఘాలు రాష్ట్ర స్థాయి పోటీలలో తలపడే జిల్లా జట్లను సైతం ఎంపిక చేశారు. 

పెరుగుతున్న ఆశావహుల తాకిడి

ప్రస్తుతం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఉండటంతో విధ్యార్ధులు ఏదో ఒక క్రీడ నే ర్చుకోవాలని తలంపుతో స్టేడియానికి తర్పీదుకు వెళుతున్నారు. ఆయా క్రీడా శిక్షణ ప్రాంగణంలో గతంలో కంటే డబుల్‌ సంఖ్యలో క్రీడాకారులు పెరగడం విశేషం. 

క్రీడా వసతుల నిలయంగా పటేల్‌ స్టేడియం

స్టేడియంలో అన్ని క్రీడలకు వసతులు కల్పించడంతో క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ప్రత్యేక చొరవతో సుమారు రూ. 3. 5 కోట్లు నిధులు కేటాయించి క్రీడాకారులకు అధనపు వసతి గదులు, స్కేటింగ్‌ రింక్‌, జిమ్నాజియం, వాలీబాల్‌ కోర్టుకు ఫెన్సింగ్‌, ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియానికి రేకులు మార్పిడి, సింథటిక్‌ కోర్టులు, అథ్లెటిక్స్‌ ట్రాక్‌ చుట్టూ ఫెన్సింగ్‌, ఇసుక రన్నింగ్‌ ట్రాక్‌, టర్ఫ్‌వికెట్‌ పిచ్‌, మినీ స్విమ్మింగ్‌పూల్‌, ఆర్చరీ తదితర అభివృధ్ధి పనులు చేయడంతో అన్ని క్రీడా సదుపాయాలు ఒకే చోట కేంద్రీకృతమవడంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

 

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST