Advertisement
Advertisement
Abn logo
Advertisement

విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు

గుంటూరు(క్రీడలు), నవంబరు30: స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో మంగళవారం విభిన్నప్రతిభావంతులకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌  చైర్మన్‌ ముంతాజ్‌ పఠాన్‌ మాట్లాడుతూ వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమశాఖ పీడీ మధుసూదనరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో మొత్తం 500మంది వరకు క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చీఫ్‌కోచ్‌ జి.వెంకటేశ్వర్లు, ఐఈడీ జిల్లా కో-ఆర్డినేటర్లు, ఎన్జీవో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement