ముఖ్యమంత్రి ఇలాకాలో స్పోర్ట్స్ హబ్

ABN , First Publish Date - 2021-08-02T00:32:23+05:30 IST

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో స్పోర్ట్స్ హబ్ కు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చుదిద్దాలన్న

ముఖ్యమంత్రి ఇలాకాలో స్పోర్ట్స్ హబ్

గజ్వేల్: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో స్పోర్ట్స్ హబ్ కు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చుదిద్దాలన్న సీఎం ఆదేశాలతో అధికారులకు పనిని మొదలు పెట్టారు. ఇప్పటికే గజ్వేల్‌లో పర్యటించిన శాట్స్ ఛైర్మన్ క్రీడారంగం మౌలిక వసతులపై జిల్లా అధికారులతో చర్చించారు. దీంతో త్వరలోనే గజ్వేల్లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు కానుంది‌. స్పోర్ట్స్ హబ్ ఏర్పాటైతే స్థానిక క్రీడాకారులకు మంచి రోజులు వచ్చే అవకాశముంది.


క్రీడారంగంలో తెలంగాణను దేశానికే తలమానికంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ నేపధ్యంలోప్రణాళికబద్ధంగా పనిచేయాలని ఇటీవల శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డిని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గజ్వేల్లో పర్యటించిన వెంకటేశ్వరరెడ్డి జిల్లా మంత్రి హరీశ్రావుతో పాటు టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమై జిల్లాలో క్రీడారంగం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సుదీర్ఘంగా చర్చించారు. గజ్వేల్ కేంద్రంగా 15 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ (మినీ క్రీడా గ్రామాన్ని) నిర్మిస్తే జిల్లాలోని వర్థమాన క్రీడాకారులు, యువతకు మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు సూచించడంతో పలువురు క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడా నిపుణులతో వెంకటేశ్వర్ రెడ్డి చర్చించి స్పోర్ట్స్ హబ్ ప్రణాళికను సిద్ధం చేశారు. 

Updated Date - 2021-08-02T00:32:23+05:30 IST