క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక వికాసం

ABN , First Publish Date - 2021-03-01T06:45:14+05:30 IST

శారీరక ధృడత్వానికి, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, క్రీడలలోనూ తైక్వాండోది విశిష్ట స్థానమని కందుకూరు సబ్‌ కలెక్టరు ఎ.భార్గవతేజ పేర్కొన్నారు.

క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక వికాసం
విజేతలకు బహుమతులు అందజేస్తున్న భార్గవతేజ

కందుకూరు, ఫిబ్రవరి 28 : శారీరక ధృడత్వానికి, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, క్రీడలలోనూ తైక్వాండోది విశిష్ట స్థానమని కందుకూరు సబ్‌ కలెక్టరు ఎ.భార్గవతేజ పేర్కొన్నారు. తైక్వాండో శారీరక, మానసిక వికాసానికే గాక ఆత్మరక్షణకు , తోటివారిని రక్షించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం కందుకూరులో 11వ సబ్‌ జూనియర్స్‌ జిల్లా తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే చిన్నారులకు తైక్వాండో శిక్షణ నిప్పిస్తే వారి ఉజ్వల భవిష్యత్తుకు అది ఎంతో ఉపయోగకారిగా మారుతుందన్నారు. తైక్వాండో పోటీల నిర్వాహకులను, తైక్వాండో శిక్షకుడు అబ్ధుల్‌ సలాంను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సీతారామయ్య, ఉన్నం వీరాస్వామి, వీవీ.పాలెం ఎస్సై హజరత్తయ్య, తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వీరయ్య, ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల డైరక్టర్‌ బాలభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T06:45:14+05:30 IST