మల్లఖంచ్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

ABN , First Publish Date - 2021-12-09T05:47:26+05:30 IST

భీమవరం ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం పాఠశాల ఆవరణలో బుధవారం మల్లఖంచ్‌ జిల్లాస్థాయి సెలక్షన్‌ పోటీలు నిర్వహించారు.

మల్లఖంచ్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
పోటీల్లో విద్యార్థుల విన్యాసం

భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 8 : భీమవరం ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం పాఠశాల ఆవరణలో బుధవారం మల్లఖంచ్‌ జిల్లాస్థాయి సెలక్షన్‌ పోటీలు నిర్వహించారు. మల్లఖంచ్‌లో సబ్‌ జూనియర్‌ 1, 2, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి.మల్లఖంచ్‌ జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి శేఖరరాజు మాట్లాడుతూ పోటీలకు 90 మంది బాలురు, బాలికలు పాల్గొన్నారని తెలిపారు.   ఎంపికైన వారు ఈనెల 11, 12 తేదీల్లో బాపట్లలో జరిగే 2వ రాష్ట్ర మల్లఖంచ్‌ ఛాంపియన్‌ షిప్‌లో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. 


Updated Date - 2021-12-09T05:47:26+05:30 IST