ప్రతిభావంతులను గుర్తించండి

ABN , First Publish Date - 2020-08-05T09:17:17+05:30 IST

మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు కృషి చేయాలని అధికారులను కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ..

ప్రతిభావంతులను గుర్తించండి

అధికారులకు క్రీడా మంత్రి రిజిజు ఆదేశాలు

న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు కృషి చేయాలని అధికారులను కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ఆదేశించారు. క్రీడా శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌, సాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రధాన్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో ఖేలో ఇండియా క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘ఏడాదికి ఒకసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌, యూనివర్సిటీ గేమ్స్‌తో కొంతమంది ప్రతిభావంతులను గుర్తించాం. అయితే, క్రీడా ప్రపంచంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా నిలిపేందుకు ఈ ప్రయత్నం సరిపోదు. రాష్ట్రస్థాయిలో కూడా తరచూ క్రీడా పోటీలను నిర్వహించాలి. ఖేలో ఇండియా పథకం ద్వారా పోటీలు నిర్వహించే రాష్ట్రాలకు సాయం అందించాలి’ అని కిరణ్‌ తెలిపారు. 

Updated Date - 2020-08-05T09:17:17+05:30 IST