ద్రవిడ్‌ ఎలా అంగీకరించాడో?

ABN , First Publish Date - 2021-11-19T09:07:48+05:30 IST

ద్రవిడ్‌ ఎలా అంగీకరించాడో?

ద్రవిడ్‌ ఎలా అంగీకరించాడో?

కోచ్‌ బాధ్యతలపై రికీ పాంటింగ్‌  జూ ఆ పదవికి నన్నూ అడిగారు..


న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఉండేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించడం ఆశ్చర్యం కలిగించిందని ఆస్ర్టేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ‘అండర్‌-19 జట్టుకు కోచ్‌గా ఉన్నప్పుడు ద్రవిడ్‌ చాలా సంతోషంగా ఉండేవాడు. ఈ విషయమై మా మధ్య చాటింగ్‌ కూడా జరిగింది. అతడి కుటుంబం గురించి నాకు ఎక్కువగా అవగాహన లేదు. కానీ తనకు ఇద్దరు చిన్న పిల్లలున్నట్టు తెలుసు. టీమిండియాకు కోచ్‌ అంటే.. చాలా సమయం కేటాయించాల్సివుంటుంది. అందుకే ద్రవిడ్‌ ఈ బాధ్యతను తీసుకున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. అయితే భారత జట్టుకు మాత్రం సరైన వ్యక్తే  కోచ్‌గా వచ్చాడని చెప్పవచ్చు. ఇక ఇదే పదవి కోసం నన్ను కూడా అడిగారు. ఐపీఎల్‌ సమయంలో చాలా ఒత్తిడి తెచ్చారు. అయితే అంత సమయం నేను ఇవ్వలేనని చెప్పాను. అంతేకాకుండా అందుకు ఐపీఎల్‌లో కోచింగ్‌ను వదులుకోవాల్సి ఉంటుంది’ అని పాంటింగ్‌ తెలిపాడు.

Updated Date - 2021-11-19T09:07:48+05:30 IST