Advertisement
Advertisement
Abn logo
Advertisement

అడిగిన వివరాలను వెల్లడించండి

హాకీ ఇండియాకు హైకోర్టు సూచన


న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో హాకీ ఇండియా (హెచ్‌ఐ)కు ఎదురుదెబ్బ తగిలింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రకారం హెచ్‌ఐ సభ్యులు, ఉద్యోగుల జీతాల సమాచారం వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. హెచ్‌ఐ ప్రభు త్వ ఆధీనంలోనిది కాబట్టి.. సీఐసీ ఉత్తర్వులను అమలు చేయడంలో అభ్యంతరం ఏంటని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. హెచ్‌ఐ సభ్యులు, ఉద్యోగుల జీతాల సమాచారం వెల్లడిం చాలని సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ అనే వ్యక్తి ఆర్‌టీఐ పిటిషన్‌ వేశాడు. 

Advertisement
Advertisement