కేటీఆర్‌ను కలిసిన విహారి, కృష్ణప్రియ

ABN , First Publish Date - 2021-01-19T06:11:03+05:30 IST

సిడ్నీ టెస్ట్‌ హీరో హనుమ విహారి.. ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకొన్నాడు. ఈ సందర్భంగా హనుమను కేటీఆర్‌ శాలువాతో సత్కరించగా...

కేటీఆర్‌ను కలిసిన విహారి, కృష్ణప్రియ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సిడ్నీ టెస్ట్‌ హీరో హనుమ విహారి.. ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకొన్నాడు. ఈ సందర్భంగా హనుమను కేటీఆర్‌ శాలువాతో సత్కరించగా.. మంత్రికి విహారి బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్‌కు విహారి దూరమైన సంగతి తెలిసిందే. అలాగే బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, తరుణ్‌ కోన కూడా కేటీఆర్‌ను కలిశారు.

Updated Date - 2021-01-19T06:11:03+05:30 IST