స్పోర్ట్స్‌ కోటా పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-09-23T09:09:37+05:30 IST

విద్యా ప్రవేశాల్లో స్పోర్ట్స్‌ కోటాను పునరుద్ధరిస్తూ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ (వైఏటీ) జీఓ నెంబర్‌ 2ను విడుదల ...

స్పోర్ట్స్‌ కోటా పునరుద్ధరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): విద్యా ప్రవేశాల్లో స్పోర్ట్స్‌ కోటాను పునరుద్ధరిస్తూ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ (వైఏటీ) జీఓ నెంబర్‌ 2ను విడుదల చేసింది. తాజా జీఓ ప్రకారం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మినహా మిగిలిన అన్ని టెక్నికల్‌ విద్యా కోర్సుల ప్రవేశాల్లో 0.5 శాతం స్పోర్ట్స్‌ కోటాను 2018కి మునుపటిలానే వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, యూనివర్సిటీల వీసీలకు వైఏటీ కార్యదర్శి శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ట్రిపుల్‌ ఐటీ, ఇంజనీరింగ్‌, బీఫార్మసీ, ఐసెట్‌, ఈసెట్‌, ఎంబీఏ, ఎడ్‌సెట్‌, లాసెట్‌, డైట్‌సెట్‌, వ్యవసాయ సంబంధిత కోర్సుల ప్రవేశ పరీక్షల్లో కనీస అర్హత మార్కులు సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కోటా కింద సీట్లు లభించనున్నాయి. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ గుర్తించిన 31 క్రీడాంశాల్లోని వారికే ఈ కోటా వర్తించనుంది. 

Updated Date - 2020-09-23T09:09:37+05:30 IST