హమ్మయ్య...ఒక్క బంతినైనా వదిలేశావ్‌!

ABN , First Publish Date - 2020-09-29T13:11:01+05:30 IST

పంజాబ్‌పై రికార్డు ఛేదనలో హీరోగా నిలిచిన రాహుల్‌ తెవాటియాకు యువరాజ్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకంటారా.. కాట్రెల్‌ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లు మాత్రమే కొట్టినందుకట.

హమ్మయ్య...ఒక్క బంతినైనా వదిలేశావ్‌!

ముంబై: పంజాబ్‌పై రికార్డు ఛేదనలో హీరోగా నిలిచిన రాహుల్‌ తెవాటియాకు యువరాజ్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకంటారా.. కాట్రెల్‌ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లు మాత్రమే కొట్టినందుకట. 2007 టీ20 ప్రపంచక్‌పలో బ్రాడ్‌ ఓవర్‌లో యువరాజ్‌ ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. అందుకే ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్యూ భాయ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘రాహుల్‌ భాయ్‌... ఆరు బంతుల్లో ఒక్క బంతినైనా మిస్‌ చేసినందుకు కృతజ్ఞతలు. మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్‌కు అభినందనలు. మయాంక్‌, సంజూ కూడా ఇరగదీశారు’ అని యువీ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-09-29T13:11:01+05:30 IST