Abn logo
Sep 20 2021 @ 00:38AM

స్పీకర్‌ తమ్మినేనికి చుక్కెదురు!

కలివరం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి భారతమ్మ గెలుపు


ఆమదాలవలస/రూరల్‌: ప్రాదేశిక ఎన్నికల్లో స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు చుక్కెదురైంది. ఆయన సొంత ప్రాదేశికమైన కలివరం నుంచి టీడీపీ అభ్యర్థి తమ్మినేని భారతమ్మ 648 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కోట కృష్ణవేణికి 752 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి తమ్మినేని భారతమ్మకు 1,400 ఓట్లు వచ్చాయి. దీంతో భారతమ్మ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఆమె స్పీకర్‌కు స్వయాన వదిన (అన్న భార్య) కావడం గమనార్హం.   


అలాగే పొందూరు మండలంలో 21 ఎమ్పీటీసీ స్థానాలు ఉండగా... ఇందులో 13 వైసీపీకి, 8 టీడీపీకి వచ్చాయి.  


కొర్లాంలో డ్రాతీసి....

సోంపేట: సోంపేట మండలంలో మొత్తం 23 ఎంపీటీసీలకు గాను 21 స్థానాల్లో వైసీపీ , రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కాగా  కొర్లాం ప్రాదేశికంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు 873 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు డ్రా తీయడంతో టీడీపీ గెలుపొందింది.