Abn logo
Jul 13 2020 @ 18:51PM

‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ ఫస్ట్ లుక్.. పూరి చేతుల్లో

‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నుంచి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం - ఈఎస్టీ. 1975’  అనే క్రైమ్ కామెడీ ల‌వ్ స్టోరీ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్క‌ర్ న‌టిస్తోంది. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వినూత్న‌మైన టైటిల్‌తో పాటు, కొన్ని మీమ్స్‌ను సోషల్ మీడియాలో వదిలి.. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన చిత్ర బృందం.. ఇప్పుడు చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ ఫస్ట్ లుక్‌ను డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ విడుదల చేయబోతున్నారు.


ఫస్ట్‌లుక్‌ను డ్యాషింగ్ డైరెక్టర్ విడుదల చేయబోతున్నారని తెలుపుతూ చిత్రయూనిట్ అఫీషియల్‌గా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌ను పూరి జూలై 14 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఈ చిత్రంలో హీరో సాయికుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని పునః ప్రారంభించి సాధ్య‌మైనంత త్వ‌ర‌లో రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నామని నిర్మాత‌లు రాజు - ప్ర‌మోద్ అంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement