ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయంతో సైయెంట్‌ జట్టు

ABN , First Publish Date - 2020-10-20T05:33:01+05:30 IST

అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌లో పరిశ్రమకు అవసరమైన పాఠ్యాంశాలను తయరు చేసి ఇవ్వడానికి వరంగల్‌కు చెందిన ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయంతో సైయెంట్‌ ఒప్పందం కుదుర్చుకుంది.....

ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయంతో సైయెంట్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌లో పరిశ్రమకు అవసరమైన పాఠ్యాంశాలను తయరు చేసి ఇవ్వడానికి వరంగల్‌కు చెందిన ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయంతో సైయెంట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌లో నైపుణ్యాల కొరతను అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని సైయెంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్ర వెలగపూడి తెలిపారు. యాడిటివ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ (3డీ ప్రింటింగ్‌) లో సైయెంట్‌కు మంచి అనుభవం ఉందన్నారు. 

Updated Date - 2020-10-20T05:33:01+05:30 IST