Advertisement
Advertisement
Abn logo
Advertisement

సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. బెయిర్‌స్టోకి బై బై!

హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల రిటైన్ జాబితాను సమర్పించే గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.


టాప్ క్లాస్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను వదులుకుంది. కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోవాలని భావించింది. అయితే, రషీద్ ఖాన్ విషయంలో డీల్ ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉందని సమాచారం.


విలియమ్సన్‌తోపాటు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లైన అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను కూడా రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. భవిష్యత్తులో సమద్ తమకు మంచి ఆయుధం అవుతాడని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది. ఇక, మాలిక్ గత సీజన్‌లో పేస్‌తో అద్భుతంగా రాణించాడు.


డేవిడ్ వార్నర్‌ను వదిలేసుకోవడం పక్కా అని ఇది వరకే తేలిపోయింది. వార్నర్‌కు గత సీజన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా తుది జట్టులోనూ చోటు కోల్పోయాడు. బెయిర్‌స్టోను వదులుకున్న ఎస్ఆర్‌హెచ్.. భవిష్యత్తులో తమ దారులు మళ్లీ కలుసుకోవచ్చని పేర్కొంది. జట్టులో భాగమైన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. ఇది ఎంతమాత్రమూ గుడ్‌బై కాదని, కొంతమంది ‘రైజర్ల’ను వేలంలో మళ్లీ స్వాగతిస్తామంటూ ట్వీట్ చేసింది. 

Advertisement
Advertisement