Advertisement
Advertisement
Abn logo
Advertisement

Sri Lanka జట్టుకు జరిమానా

కొలంబో: భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో చేజార్చుకున్న శ్రీలంకకు మరో షాక్ తగిలింది. మంగళవారం టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతోపాటు ఐసీసీ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లోని మొత్తం పాయింట్ల నుంచి ఒక దానిని తగ్గించింది. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేసినందుకు గాను మ్యాచ్ రిఫరీ రంజన్ ముదుగలే ఈ చర్యలు తీసుకున్నారు. భారత్-శ్రీలంక మధ్య చివరి వన్డే రేపు (23న) జరగనుంది. 

Advertisement
Advertisement